-ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే ఏకైక నాయకుడు MLA బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
64వ డివిజన్ కండ్రిక K3 అపార్ట్మెంట్స్ వెనుక నుండి నాలుగు స్తంభాల సెంటర్ వరకు మంగళవారం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా బొండా రవితేజ మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలను ఇంటింటికీ వెళ్లి తెలుసుకుని, సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని… 64వ డివిజన్‌లో గత రెండేళ్లలో సుమారు రూ.48 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మసీదు నిర్మాణానికి సహాయం, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్ల పంపిణీతో పాటు అవసరమైన వారికి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలను చేపట్టామని, డివిజన్‌లో ప్రధానంగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని, రానున్న రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు కొత్త పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని బొండా ఉమా అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి రూ.15,000 చొప్పున జమ చేసి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని తెలిపారు. పేదలకు కేవలం రూ.5 రూపాయల కు నాణ్యమైన భోజనం అందించే అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తూ ప్రజల ప్రభుత్వం అనే నమ్మకాన్ని NDA కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని బొండా రవితేజ స్పష్టం చేశారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవడం పరిష్కరించడం.. సంక్షేమం, అభివృద్ధిని అందించడం ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో 64 వ డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవి కుమార్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ కార్యదర్శి పలగాని భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, సెంట్రల్ నియోజకవర్గ అబ్జర్వర్ బచ్చుల బోస్, డివిజన్ ప్రధాన కార్యదర్శి Sk బాబు, బ్యాంక్ చైర్మన్ శ్రీనాథ్, బ్యాంకు డైరెక్టర్లు పొన్నం శేషగిరి , శంకర్ రెడ్డి,యూనిట్ ఇన్చార్జి కోమరి రాజేష్, కే హర్ష సాయి, కే చరణ్, బూత్ కన్వీనర్, కంకణాల బాబు, కోరాడ రమణ,నల్లిపోగు కన్నా, సువర్ణ రాజు, సుందర్ రావు, రమణ,అడప సాయి,టిడిపి నాయకులు పొట్నూర్ అప్పలనాయుడు, పొట్నూరి సూర్యనారాయణ,వెంకట్, రమేష్, పండు, తిరుపతిరావు, మహిళా నాయకులు పుప్పాల భాను ,ఇప్పిళ్ళ నాగమణి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News