Breaking News

బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి… : ఏపీ ఎమ్మార్పీఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వంలో ఏదో మూల అధికార పార్టీ నేతల చేతుల్లో దళితులు బలైపోతున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ఆరోపించారు. బుధవారం ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ధర్మపోరాట దీక్ష జరిగింది. ఇందులో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందకపోగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని స్పష్టమైన పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండేళ్ల పాలనలో 22 మంది దళితులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని ఈ కేసులపై సమగ్ర విచారణ జరపాలన్నారు. కేసుల విచారణకు తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలి. బాధిత దళిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్రేషియా ప్రకటించాలి, అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు బాధిత కుటుంబాలకు అన్యాయం చేయాలన్నారు. ఆయన నిజంగా దళిత పక్షపాతి అయితే బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రకారం విధులు నిర్వర్తించని అధికారులపై చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో హత్యకు గురైన దళితుల ఇళ్లకు వెళ్లి చైతన్యపరుస్తామన్నారు. దళితులకు మద్దతుగా ఎస్టీ, మైనారిటీ, బీసీ, ప్రజాస్వామ్యవాదులందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. సామాజిక ఐక్యత అవసరమన్నారు. ఈ నిరసన దీక్షలో హత్యకు గురైన బాధిత కుటుంబీకులూ, ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *