Breaking News

విజయవాడ నగరంలో ఆగస్టు 15 వ తేదీ మధ్యాహ్నం నుండి మూడు రోజుల పాటు ‘అలంకృత శకటాల’ ప్రదర్శన…..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆగస్టు 15 (శనివారం) నాడు అమరావతిలోని నేలపాడు గ్రౌండ్ వద్ద జరిగే ఇండిపెండెన్స్ డే పరేడ్ అనంతరం, విజయవాడ నగర ప్రజలు, పర్యాటకుల సందర్శనార్థం అలంకృత శకటాలను (Tableaux) ప్రదర్శించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ ఇంచార్జ్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ శకటాలు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు నగరవాసులకు కనువిందు చేయనున్నాయన్నారు
నగరంలో ప్రజలందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా మూడు ప్రముఖ ప్రాంతాల్లో ఈ శకటాలను ఉంచడానికి ఏర్పాట్లు చేశామన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ రథం సెంటర్ ఎదురుగా ఉన్న కెనాల్ రోడ్ పార్కింగ్ ప్రదేశం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం ఎదురు మహాత్మా గాంధీ రోడ్డు, లెమన్ ట్రీ హోటల్ వద్ద నుండి స్టేట్ ఆర్ బ్ల్యూఎస్ కార్యాలయం వరకు ఉన్న ప్రాంతంలో ఉంచనున్నామన్నారు.
అమరావతి పరేడ్‌లో పాల్గొనే వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని, సంస్కృతిని ప్రతిబింబించే ఈ శకటాలను వీక్షించడానికి నగర ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. జనం రద్దీని దృష్టిలో ఉంచుకుని శకటాల వద్ద భద్రతా చర్యలతో పాటు ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని సమాచార పూర్వమందల శాఖ ఇన్చార్జి డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *