Breaking News

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

-ఆగస్టు 14న విజయవాడలో కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్
-ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 18 నుంచి 29 ఏళ్లలోపు యువతీ యువకులకు అవకాశం
-నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు వేతనం
-జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారి సి.మధుభూషణ్ రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆగస్టు 14,2026 శుక్రవారం కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారి సి.మధుభూషణ్ రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 14న ఉదయం 9.00 గంటలకు విజయవాడ గాయత్రీ నగర్‌లోని ఆధ్యా స్టోర్, పాత ఎస్బిఐ బ్రాంచ్, జూడియో స్టోర్స్ ఎదురుగా, ఘంటసాల వారి స్ట్రీట్ నందు కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రైవ్‌కు హాజరయ్యే అర్హత కలిగిన అభ్యర్థులకు కంపెనీ ప్రతినిధుల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యోగ అవకాశాలకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగి, 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలలోపు వయస్సు గల యువతీ యువకులు అర్హులని అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆసక్తి మరియు తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్‌కు హాజరయ్యే ముందు APSSDC నైపుణ్యం పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో నమోదు చేసుకోవడానికి: https://naipunyam.ap.gov.in/user-registration లింక్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్‌కు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్ లేదా బయోడేటా ఫారంతో పాటు కింది పత్రాల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని అధికారులు సూచించారు: ఆధార్ కార్డు కాపీ, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్ కార్డు కాపీ, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, రెజ్యూమ్ లేదా బయోడేటా. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారులు కోరారు. ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి అవసరమైన పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 81259 73743, 99857 59304, 93477 79032 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *