Breaking News

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు రోడ్డు లోని సీతారాంపురం మైసూర్ కేఫ్ ఎదురుగా ఐకాన్ పబ్లిక్ స్కూల్ వద్ద నుండి 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం “ఘర్ ఘర్ తిరంగా – హర్ ఘర్ తిరంగా” తిరంగా ర్యాలీలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కులాలు, మతాలు, భాషలు వేరైనా మనమంతా భారతీయులుగా ఒక్కటై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, వారికి ఘన నివాళులు అర్పించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇన్‌చార్జ్‌గా నియమించి, ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని మరింతగా పెంపొందించేలా ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నారా లోకేష్ రేపు మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని బొండా ఉమా కోరారు.

ఐకాన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ పార్ధసారధి మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఐకాన్ పబ్లిక్ స్కూల్ ర్యాలీ ప్రభుత్వ పిలుపు మేరకు ఐకాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రత్యేక ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు స్వాతంత్ర్యం మరియు దేశభక్తి గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, కేవలం పాఠశాలల్లోనే కాకుండా, తల్లిదండ్రులు కూడా పిల్లలలో దేశభక్తిని పెంపొందించాలని ఆకాంక్షించారు. రాబోయే తరాలు స్వాతంత్ర్య పోరాటం మరియు దేశభక్తి విలువలను మరచిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్స్ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *