Breaking News

స్వాతంత్ర్య స్పూర్తిని, త్రివర్ణ పతాక గౌరవాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ స్వాతంత్ర్య స్పూర్తిని, త్రివర్ణ పతాక గౌరవాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే సంకల్పంతో “హర్ ఘర్ తిరంగా” ర్యాలీని చేయడం జరిగిందని నగర పాలకసంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్స వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం, జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు శుక్రవారం ”హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా నగరంపాలెం లోని మూడు బొమ్మల సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు విధ్యార్ధులతో ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా, ప్రజలలో దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటిచెప్పేలా ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనారన్నారు. నగరంలో జాతీయ జెండా ప్రదర్శనతో పాటు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా గౌరవాన్ని కాపాడుతూ, నిబంధనలకు అనుగుణంగా జెండాను ఎగురవేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై దేశభక్తి భావాన్ని చాటాలని కోరారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రజలు భాగస్వాములు కావటానికే ప్రభుత్వం ఇటువంటి హర ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించేలా, వారిని దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావటానికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు మరియు నగర్ పాలక సంస్థ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొనుట సంతోషంగా ఉందన్నారు.

కార్యకమంలో సిటీ ప్లానర్ రాంబాబు, ఏఓ తిరుపతి నాయుడు, ఉపా సెల్ పి.ఓ సింహాచలం, మేనేజర్ బాలాజీ బాష, ఎస్ఎన్.ప్రసాద్, సి.ఓలు, విద్యార్ధులు, జియంసి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *