-విస్తరణ ప్రభావిత భవనాల్లో 90 శాతం తొలగింపు
-డ్రైన్ నిర్మాణంలో అడ్డుగా ఉన్న చెట్లలో వీలున్నవాటిని ట్రాన్స్ లొకేషన్
-విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్
-కల్వర్ట్ ల నిర్మాణం వేగవంతం….కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్ విస్తరణలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, విస్తరణలో ప్రభావితమవుతున్న 73 చెట్లను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వృక్షశాస్త్ర, ఫారెస్ట్ అధికారుల బృందం 29 చెట్లను ట్రాన్స్ లొకేషన్ చేయడానికి వీలున్నాయని, 44 చెట్లు వీలు లేవని ఇచ్చిన నివేదిక ప్రకారం, హెడ్ వాటర్ వర్క్స్ లోని ఖాళీ స్థలంలో ఇప్పటికే 18 చెట్లను విజయవంతంగా రీ-లొకేట్ చేశారని తెలిపారు. ఇక ట్రాన్స్ లొకేషన్ చేయడానికి వీలు కాని మిగిలిన 44 చెట్లలో 35 చెట్లను ఇప్పటికే తొలగించడమైనదన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభావితమవుతున్న మొత్తం 86 నిర్మాణాల్లో ఇప్పటికే 81 నిర్మాణాలను విజయవంతంగా తొలగించామని, మిగిలిన 5 భవనాలు కోర్టు కేసులో ఉన్నాయని పేర్కొన్నారు. రహదారికి ఇరువైపులా 2315 మీటర్ల మేర డ్రైన్ నిర్మాణం చేయాల్సి ఉండగా, అందులో 1482 మీటర్ల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. అలాగే రహదారి నిర్మాణంలో భాగమైన 25 కల్వర్టులకు గాను ఇప్పటికే 17 కల్వర్టుల నిర్మాణం పూర్తయిందని వివరించారు. రహదారి విస్తరణకు అడ్డంకిగా ఉన్న షిఫ్ట్ చేయాల్సిన 73 విద్యుత్ స్తంభాలలో 25 స్తంభాలను, మార్చాల్సిన 11 ట్రాన్స్ఫార్మర్లలో 3 ట్రాన్స్ఫార్మర్లను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు మార్చడం జరిగిందన్నారు. ప్రతి సోమవారం విస్తరణ పనుల పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించడంతో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, విద్యుత్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో పని చేస్తుండటంతో విస్తరణ పనులన్నీ వేగంగా జరుగుతూ, అతి త్వరలో పూర్తీ చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
Prajavartha Online Telugu News