-మారుతి కోఆపరేటివ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలోఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ పడమట పరిధిలోని మారుతి కోఆపరేటివ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమ్యూనిటీ హాల్‌ను స్థానిక శాసనసభ్యులు గద్దె రామమోహన్ తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ, స్థానిక ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ భవనం స్థానిక ప్రజలకు శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాలు అందుబాటులో ఉండటం సమాజ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని ఎంపీ పేర్కొన్నారు. కమ్యూనిటీ హాళ్లు వంటి సౌకర్యాలు ప్రజలకు సామాజిక కార్యక్రమాలను సౌకర్యవంతంగా నిర్వహించుకునే అవకాశం కల్పిస్తాయని తెలిపారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్‌లో ప్రజా సౌకర్యాల విస్తరణకు, మౌలిక వసతుల కల్పనకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.స్థానిక ప్రజల సామాజిక అవసరాలకు ఉపయోగపడే ఇలాంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ, కంఠమనేని హరిబాబు, జాస్తి పూర్ణచంద్రరావు, మండవ నాగేశ్వరరావు, కె బి జి తిలక్, జే వెంకట్రావు, అక్కినేని అంజనాదేవి, డాక్టర్ గురు ప్రసాద్, ఫిరోజ్, మన్నె జయప్రకాష్, జగన్మోహన్ రావు, రాము స్థానిక ప్రజలు, మారుతి కోఆపరేటివ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News