Breaking News

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం

-గ్రామస్థాయి నుంచి కార్పొరేషన్ వరకు పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై సమగ్ర చర్చ
-ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ డివి మేనర్ హోటల్ వేదికగా టీడీపీ జిల్లా పార్టీ ఎన్నికల సమావేశం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమావేశంలో సమగ్రంగా చర్చించారు. పార్లమెంటరీ పార్టీ ఎలక్షన్ ఇంచార్జ్ మక్కెన మల్లికార్జునరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు గద్దె అనురాధ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్దా వెంకన్నతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) సమావేశంలో పాల్గొన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలు, కూటమి అభ్యర్థుల విజయానికి అవసరమైన కార్యాచరణపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల ప్రక్రియను పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని నిర్ణయించారు.

అభ్యర్థి ఎవరైనా.. కూటమి గెలుపే లక్ష్యం

కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా, వారి విజయానికి పార్టీ శ్రేణులందరూ సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా కూటమి అభ్యర్థుల విజయమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమన్వయంతో ఎన్నికల కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించారు.

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు, స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించే దిశగా ప్రణాళికలను పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ, కార్పొరేషన్ స్థాయి వరకు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల విజయానికి అవసరమైన కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ నాయకత్వం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *