న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) మేనేజింగ్ డైరెక్టర్ (MD)ని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరా తీరు, ధరల నియంత్రణ, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సరుకులు అందుబాటులో ఉండేలా తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై చర్చించారు. ప్రజలందరికీ నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ లక్ష్య సాధనలో కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారాన్ని మరింత విస్తృతం చేస్తూ, భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News