Breaking News

ప్రశాంతంగా ఎపిపిఎస్సీ ద్వారా కంప్యూటర్ నైపుణ్య పరీక్షలు

-నాలుగు షిఫ్ట్ లలో కంప్యూటర్ టెస్ట్ హాజరైన 388 మంది ఉద్యోగులు
– డి ఆర్వో నరసింహులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, వార్డు కార్యదర్శులకు కంప్యూటర్ నైపుణ్యం టెస్ట్ శుక్రవారం పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం కాతేరు లోని జీ ఎస్ ఆర్ ఆన్లైన్ అకాడమీ లో కంప్యూటర్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పరీక్ష జరిగిన వివరాలు జీ. నరసింహులు తెలుపుతూ కారుణ్య నియామకాలు కింద నియమించబడి రెవెన్యూ , పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖల తరపున  గ్రామ, వార్డ్ సచివాలయాలలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు కంప్యూటర్ నైపుణ్యం పై పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా అత్యంత పకడ్బందీగా నిర్వహించడం జరిగిందన్నారు.ఈరోజు పరీక్షలకు మొత్తం 418 కి గాను 388 మంది హాజరైనట్లు   ఎపిపి ఎస్సీ సెక్షన్ ఆఫీసర్ జీ. అశోక్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి ఉ.10 ల వరకు మొదటి షిఫ్ట్ 100 మంది కి గాను 96 మంది , మ.12 నుంచి మ.12.30 వరకు 2వ షిఫ్ట్ లో 106 మంది కి గాను 92 మంది, మ.2.30 నుంచి మ.3 వరకు మూడోవ షిఫ్ట్ 106 మందికి గాను 101 మంది, సా.5 నుంచి సా.5.30 వరకు నాల్గోవ షిఫ్ట్  106 మందికి గాను 99 మంది ఉద్యోగులు కంప్యూటర్ టెస్ట్  హాజరయ్యారని తెలిపారు.ఈ పరీక్షలను ఎపిపిఎస్సీ సెక్షన్ ఆఫీసర్ జి. అశోక్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఖాసిం వలి , తహశీల్దార్ పి. చిన్నారావు , ఆర్ ఐ వి . రత్న సాగర్, కళాశాల శశి పర్యవేక్షణ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *