Breaking News

కూనవరం దగ్గరలో శుద్ధమెట్ట పైకి వెళ్లి పరిశీలించిన జేసీ

-అర్హులకు ఇంటి పట్టాలు పంపిణీ కై పరిశీలన చేశాం.. జేసీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి పేదవానికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద ఇంటి స్థలాలు కేటాయించడానికి క్షేత్ర స్థాయి లో పర్యటించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం సీతానగరం మండలం ముగ్గళ్ళ గ్రామం కోరుకొండ రోడ్డులో గల కూనవరం దగ్గరలో శుద్ధమెట్టను అధికారులతో జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ వివరాలు తెలుపుతూ, సీతానగరం, రఘుదేవపురం, కూనవరం గ్రామాలకు చెందిన 1600 మంది లబ్ధిదారులకు ఎన్.పి.ఐ. కింద ఇళ్ల స్థలాలు అందించడానికి శుద్దమెట్ట వద్ద కేటాయించిన స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల స్థలాలు సత్వరమే అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరిన మీదట క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు.శుద్దమెట్ట వద్ద కేటాయించిన స్థలంలో కొంత ప్రాంతాన్ని ఇళ్ల స్థలాలకు అనుగుణంగా సరి చేయ్యాడం జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన కొండ అలాగే ఉండడంతో దానిని పరిశీలించిన కొండను అనుకుని పక్కనే ఇళ్ల స్థలాలు అందించడానికి రెండు ఎకరాలు భూమి కొనుగోలు చేయడమా లేదా ఈ కొండ వద్ద స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం అనేది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ ఎస్. సత్యనారాయణ రాజు, జిల్లా లాండ్ సర్వే అధికారి పి. లక్ష్మణరావు, మండల సర్వేయర్ రవికాంత్ , సచివాలయం సర్వేయర్ వెంకటేష్, విఆర్ఓ గంగరాజు, తదితరులు ఉన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *