-జగ్గయ్యపేట సమీపంలోని ఎస్ఎల్ ఫార్మా కంపెనీలో పని చేస్తూ విషవాయువు బారిన పడిన భాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యాధికారులను ఆదేశించారు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట ఎస్ఎల్ ఫార్మా కంపెనీలో విషవాయువుకు గురై మెరుగైన వైద్య చికిత్సకై విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శనివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పరామర్శించి వైద్యుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగ్గయ్యపేట ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని పారామౌంట్ ఎదురు రోడ్డులో గల ఎస్ఎల్ కెమికల్స్ కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు ఉదయం ఆకస్మాత్తుగా విషవాయువు కారణంగా ఊపిరి అందక పడిపోయారన్నారు. హబీబుర్ రెహమాన్, జోయర్ రెహమాన్, పి శివప్రసాద్ు నిర్వహణలో భాగంగా కంపెనీ గోడౌన్ నందు గల కెమికల్ డ్రమ్‌ను తెరిచిన సందర్భంలో విషవాయువు బయటకు వచ్చి ఊపిరితిత్తులకు సోకడంతో అస్వస్తతకు గురైయ్యారన్నారు. ఇది గమనించిన యాజమాన్యం మెరుగైన చికిత్స నిమిత్తం హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రమాదానికి గురైన కార్మికులకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడంతో వైద్యాధికారులు స్పందించి తక్షణమే వైద్య సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఎన్ఎల్ కెమికల్ కర్మాగారాన్ని సంబంధిత అధికారులు పరిశీలించి నివేదికను సమర్పించాలని ఆదేశించామన్నారు. ఎస్ఎల్ కెమికల్ కర్మగారాన్ని నందిగామ ఆర్డివో క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని కర్మాగారాల డిప్యూటి ఇన్స్పెక్టర్, పాల్యుషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ అధికారులు కర్మాగారాన్ని పరిశీలిస్తున్నారన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వలన విషవాయుపుకు గురి అయిన్నట్లు గుర్తిస్తే తగిన చర్యలు: తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. విషవాయువుకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్య అధికారులను ఆదేశించామన్నారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
Prajavartha Online Telugu News