-ఇకపై వేలిముద్రలు పడని వారి కనుపాప ను ధృవీకరించి నిత్యావసర సరుకుల పంపిణీ
-జేసీ.. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులు అందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందచేసే నిత్యావసర సరుకుల పంపిణీ లో ఇబ్బందు లను అధిగమించేందుకు 364 ఐరిష్ రీడర్ల ను సమకూర్చడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.శనివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఎమ్ యూ డి యజమానులకు ఐరిష్ రీడర్లు డి ఎస్ వో పి . ప్రసాద రావు తో కలిసి జేసి అందచేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా పేదలకు ఆహార భద్రత చట్టం క్రింద కార్డుదారుల యొక్క ఆధార్ బయో మెట్రిక్ ధృవీకరణ ప్రామాణికంగా తీసుకుని నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. అయితే కుష్టు వ్యాధిగ్రస్తులు, వృద్దులు, రోజు వారి కూలీల వేలి ముద్రలలో సమస్యల కారణంగా బయోమెట్రిక్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి వేలిముద్రలు సరిగా పడని లబ్దిదారుల సౌకర్యార్ధం, వారి ఆధార్ సమాచార ధృవీకరణ కోసం కనుపాప (IRIS) సమాచారాన్ని ధ్రువీకరించి నిత్యావసరాలను పంపిణీ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు.ఆమేరకు తూర్పు గోదావరి జిల్లా ఆధునిక ప్రమాణాలతో కూడిన 364 IRIS రీడర్లను నిత్యావసర సరుకుల పంపిణీ చేసే మొబైల్ డెలివరీ యూనిట్ ఆపరేటర్లకు శనివారం సరఫరా చేశామన్నారు . ఇకపై వేలిముద్రలు సరిగా పడని లబ్దిదారులు వారి నెల వారి నిత్యావసర సరుకులను సజావుగా పొందడానికి MDU వాహనముల వద్ద గల IRIS రీడర్ల ద్వారా సులభంగా పొందే సదుపాయాన్ని జూన్ నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో డి ఎస్ వో పి. ప్రసాద రావు, ఏ ఎస్ వో భాస్కర్, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది, మొబైల్ డెలివరీ యూనిట్స్ చోదకులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News