Breaking News

ఆరోగ్య కేంద్రాలలో పారిశుధ్యం నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.శనివారం మధ్యాహ్నం తాడితోట. అంబేడ్కర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నిత్యం ప్రజలకు చేరువలో అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ఆయా ఆరోగ్య కేంద్రాల నిర్వహణ లో పారిశుధ్య నిర్వహణకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రతి రోజు ఎన్ని ఓ పి లు చూస్తారని కలెక్టర్ అడుగగా 40 నుంచి 50 మంది వరకు రావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి శనివారం చిన్న పిల్లలకి ఇమ్మునైజేషన్ ఇవ్వడం జరుగు తుందన్నారు . ఈరోజు 35 మంది చిన్నారులకు ఇమ్మునైజేషన్ టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రి లో లేబర్ రూం గురించి అడుగగా యూ హెచ్ సి ల పరిధిలో లేబర్ రూమ్స్ ఉండవని సిబ్బంది కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రి లో రోగుల వైద్య పరీక్షలు కోసం ఏర్పాటు చేసిన బెడ్ పై దుప్పట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పలు రిజిస్టర్ లను తనిఖీ చేసి, నమోదు వివరాలు పరిశీలించి , తగిన సూచనలు చేశారు.ఈ “యూ హెచ్ సి” పరిధిలో ఆరు పోస్టులు ఉన్నట్లు, ప్రతి శనివారం పిల్లలకు ఇమ్మునైజేషన్ టీకాలను ఉదయం వెయ్యడం జరుగుతుందని నర్స్ ఏ. రాణి కలెక్టర్ కు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *