Breaking News

తూర్పు నియోజకవర్గంలో రామలింగేశ్వర నగర్,గాయత్రీ రోడ్,హెల్త్ సెంటర్ నందు 15,16 డివిజన్ల వాలంటీర్ల వందనం కార్యక్రమంలో

-ముఖ్య అతిధిగా పాల్గొన్న నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సందర్భలోఅవినాష్ మట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు చూసి, వాటిని పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించి, ప్రభుత్వానికి ప్రజలకూ మధ్య వారధులుగా వాలంటీర్ వ్యవస్థ పెట్టారని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు పారదర్శకంగా మరియు సమర్ధవంతముగా ప్రజలకు చేరేలా చేసే వాలంటీర్లు అని కొనియాడారు.సుమారు 3 లక్షల మంది వాలంటీర్లు గా తమ సేవలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు..వారి సేవల ప్రాతిపదికన సేవ పురస్కారాలు, వాలంటీర్లకు అందిస్తున్నారన్నారు.తదనంతరం వాలంటీర్ల సేవలకు ప్రోత్సాహకంగా 15,16 డిసీజన్ల సంబందించి వాలంటీర్లకు సేవ వజ్రా,సేవా రత్న,సేవ మిత్ర అవార్డులతో సత్కరించారు.రాబోయే కాలంలో కూడా మీ సేవలను ప్రజలకు అందచేసే విధముగా పనిచేయాలని అవినాష్ కోరారు.ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు,జోనల్ కమిషనర్ కృష్ణ,క్లస్టర్ ఇంచార్జ్ సాయికృష్ణ రెడ్డి మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *