విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఆర్డీఏ పరిధిలోని అమరావతిలో ఆర్ 5 జోన్ నందు పేదలకు కేటాయించిన లేఅవుట్లలో గృహా నిర్మాణాలను చేపట్టేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లతో శుక్రవారం నగరంలోని కలెక్టర్ విడిది కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నగర పాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ స్వప్నల్ దినకర్ పుడ్కర్, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ సిఆర్డిఏ పరిధిలో 737 ఏకరాల విస్తీర్ణంలో 14 లేఅవుట్లలో జిల్లాకు చెందిన సుమారు 27,031 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. వీరిలో విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులు ఉన్నారన్నారు. వీరికి అనంతవరం, కురగల్లు, మందడం, నిడమర్రు, పిచ్చికపాలెం వద్ద లబ్దిదారులకు లేఅవుట్లను కేటాయించడం జరిగిందని ఆయా లేఅవుట్లలోని జగనన్న కాలనీలలో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, ఐరన్, స్టీల్, వంటి మెటీరియల్‌ను సిద్దం చేయడం జరుగుతుందన్నారు. కాంట్రాక్టర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మాణ పనులకు అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యం కల్పించేందుకు ్ల జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని కలెక్టర్ అన్నారు. కాంట్రాక్టర్లు పనులకు అవసరమైన యంత్ర సామాగ్రి, కూలీలను సిద్దం చేసుకుని ప్రారంభించుకోవాలన్నారు. అన్ని లేఅవుట్లలో పనులను ప్రారంభించి బిలో బెస్మింట్ స్థాయికి తీసుకురావాలని కలెక్టర్ డిల్లీరావు కాంట్రాక్టర్లను కోరారు. సీఆర్డీఏ ప్రాంతంలో పేద ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ స్థలాలను మంజూరు చేయడం చారిత్రాత్మకమైన సంఘటనగా నిలిచిపోతుందన్నారు. నిరుపేదలకు సొంత ఇంటి కలను నిజం చేసే మహోన్నత కార్యక్రమంలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యులు కావడం అదృష్టంగా భావించాలన్నారు. లక్షలాధి రూపాయల విలువగల భూములలోని లేఅవుట్లలో చేపట్టే గృహా నిర్మాణాలు తరతరాలు గుర్తించుకునేలా నాణ్యతతో చేపట్టి భవిష్యత్ తరాల కాంట్రాక్టర్లకు మార్గదర్శుకులుగా నిలవాలని కలెక్టర్ డిల్లీరావు కాంట్రాక్టర్లను కోరారు.సమావేశంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమీషనర్ సత్యవతి, కాంట్రాక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి నారాయణరెడ్డి, బాస్కర్‌రెడ్డి సందీప్ కుమార్ గుప్తా, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News