బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు, కమిటీ చైర్మన్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ఎస్.సి, ఎస్.టి అత్యాచార నిరోధక చట్టం ప్రొటక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (పిసిఆర్), ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ (పిఓఏ) నిఘా, పర్యవేక్షణ జిల్లాస్థాయి కమిటి సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ ఎస్. డిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులలో ఎస్.సి, ఎస్.టి బాధిత కుటుంబాలకు నిర్ణీత సమయంలో పరిహారం అందించాలని జిల్లా కలెక్టరు తెలిపారు. చట్టపరంగా పరిహారం చెల్లింపులలో జాప్యం ఉండరాదని అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి 1 నుండి నేటి వరకు ఎస్.సి, ఎస్.టి అత్యాచార నిరోధక చట్టం కింద పోలీస్ శాఖ పరిధిలో అండర్ ఇన్‌వస్టిగేషన్ (యుఐ)లో 35 కేసులు, పెండిరగ్ ట్రైల్ (పిటి)గా 3 కేసులు పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. ఈకేసుల విచారణను సత్వరమే చేపట్టి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాన్నారు. సాక్షులు, సాక్ష్యాధారాల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు పూర్తిన్యాయం అందించే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల రక్షణకు రూపొందించిన చట్టాలు, కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాలు బాధితులకు అండగా ఉంటుందనే భరోసా వారిలో కల్పించాలన్నారు. జిల్లా పరిధిలోని మండలాలలో నమోదు అయిన పెండిరగ్‌లో ఉన్న కేసులను సంబంధిత డివిజన్ల వారీగా ఆర్డీవోలు, ఏసిపిలతో క్షుణ్ణంగా సమీక్షించారు. వాటి పూర్వపరాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. చార్జిషీటు దాఖలు చేయడంలో నిబంధనలు పాటించాలన్నారు. కేసులలో పురోగతి సాధించడానికి డివిజన్ స్థాయిలో ఆర్.డి.ఓలు ప్రతినెల ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని కలెక్టరు ఆదేశించారు. బాధితులకు పరిహారం అందడంలో ఆలస్యం కూడదని, కులధృవీకరణ పత్రాలను రెవెన్యూ శాఖ అధికారులు జాప్యం లేకుండా సకాలంలో జారీ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ భూముల అమ్మకాలను నిర్వహించు కోకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎక్కువగా నివసిస్తున్న జిల్లాలోని పలు ప్రాంతాలు, తండాలలో ప్రత్యేక నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండల పరిధిలోని 15 తండాలలో నివసిస్తున్న వారికి కృష్ణా జలాలను పైపులైన్‌ల ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా మైలవరం నుండి కృష్ణా జలాలను కిడ్నీ బాధిత తండాలకు తరలించి త్రాగు నీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 49.91 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక శాఖ అనుమతించిందన్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు రాగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడతామన్నారు. 6 కోట్ల రూపాయల డిస్టిక్ట్ మినరల్ ఫండ్ నిధులతో కృష్ణా జలాలను ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులకు సంబంధించి 116 మంది బాధితులకు మానిటరీ రిలీఫ్ ఫండ్‌గా 1కోటి 37 లక్షల 33 వేల 750 రూపాయలు మంజూరు చేశారు.
ఈ సమావేశంలో కమిటి సభ్యులు బి. రాజు మాట్లాడుతూ జి.కొండూరు మండలం వెలగుటూరు గ్రామం వద్ద పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో భాగంగా లిడ్‌క్యాప్ ఏర్పాటుకు, ఏ.కొండూరు మండలంలోని గిరిజన తండాలకు కృష్ణా త్రాగునీటిని పైపు లైన్‌ల ద్వారా అందించాలని, గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని, ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో న్యాయ సాధికార సంస్థ ద్వారా చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం జిల్లా స్థాయిలో కొత్త గా ఏర్పాటు చేసిన మాన్యువల్ స్కావెంజర్స్ మరియు వారి పునరావాస చట్టం 2013 అమలు పర్యవేక్షణ జిల్లా స్థాయి కమిటీ సభ్యులు కలెక్టర్ డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు.సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, సబ్ కలెక్టర్ అదితి సంగ్, డిసిపి అజిత, ఆర్‌డివోలు ఏ.రవీంద్రరావు, వైవి ప్రసన్నలక్ష్మి, జిల్లా సాంఫీుక సంక్షేమ అధికారి బి. విజయభారతి, గురుకుల విద్యా సంస్థ జిల్లా కో`ఆర్డి నేటర్ బి. సుమిత్ర దేవి,జిల్లా గిరిజన సంక్షేమ అధికారి యం రుక్మాందగయ్య, నందిగామ ఎసిపి కె. జనార్థన్‌రెడ్డి, సిసిఆర్‌బి ఏసిపి కె. వెంకటేశ్వరరావు, ఎసిపి వెస్ట్ డా. కె. హనుమంతరావు, ఎసిపి సౌత్ డా. బి రవికిరణ్, ఏసిపి దిశ వివి నాయుడు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News