ఆర్తులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి.. జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహంతి అప్పలనరసయ్య మహలక్ష్మి ట్రస్ట్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పేర్కొన్నారు.పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఆర్థికంగా చేయూత అందించడంలో భాగంగా నగరలోని కలెక్టర్‌ విడిది కార్యాలయంలో శుక్రవారం మహంతి అప్పలనరసయ్య మహలక్ష్మి ట్రస్ట్‌ ఆద్వర్యంలో పేద విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు 60 వేల రూపాయల ఆర్ధిక సహాయపు చెక్కులను అందజేశారు.ఈసందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక స్థితిగతుల వలన పేద విద్యార్థులు నైపుణ్యవంతులైనప్పటికి ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని అటువంటి వారికి మహంతి అప్పలనరసయ్య మహలక్ష్మి ట్రస్ట్‌ ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం హర్షనీయమన్నారు. ప్రభుత్వ సహకారం అందిస్తున్నప్పటికి స్వచ్చంద సంస్థల సహాకారం కూడా ఎంతో అవసరం అన్నారు. గతంలో వికలాంగులకు ట్రై సైకిళ్ళు, స్వయం ఉపాధి కోసం పలువురికి కూరగాయలు అమ్ముకునేందుకు నాలుగు చక్రాల బళ్ళు, ఇస్త్రీ బళ్ళు, రోగులకు మందుల పంపిణీ, కుటుంబ సభ్యులకు నిత్యావసర వస్తువులు, కరోనా కష్ట కాలంలో నిత్యావసర సరుకులు, మందుల కిట్లు, రక్తం, ఆక్సిజన్‌ అందజేయడం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సేవలందించడం శుభపరిణామమన్నారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నేడు డిగ్రీ చదువుకుంటున్న ఇద్దరు పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు, ఇంటర్‌ చదువుతున్న ఇద్దరు, పదవ తరగతి చదవుతున్న ఒకరికి 10 వేల రూపాయల చొప్పున మొత్తంగా 60 వేల రూపాయల చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ చైర్మన్‌ మహంతి వాసు దేవరావు, సభ్యులు డూండి రామప్రసాద్‌, వెంకట గౌతమి, ఈశ్వర్‌, జడ్పిసిఇవో వి. జ్వోతిబసు, డ్వామా పిడి జె.సునీత, ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *