రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కొనుగోలుకు జిల్లా స్థాయి అమలు మరియు పర్యవేక్షణ కమిటీ ఆమోదం తెలియ చేసి రాష్ట్ర స్థాయి కమిటీకి సిఫార్సు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు.స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం రాత్రి జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అమలు మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి చైర్మన్ హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియ చేస్తూ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలను సాంకేతిక పరంగా మరింత అభివృద్ధి చేసి రైతులకు భరోసా ఇచ్చే క్రమంలో కంప్యూటర్, ఇతర అనుబంధ పరికరాలు అప్కాబ్ ద్వారా కొనుగోలు కి జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలపడం జరిగిందన్నారు. నూతన సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో అప్డేట్ వర్షన్ కలిగిన కంప్యూటర్స్ ను ప్యాక్ సొసైటీ లకు అందచేసే క్రమంలో జిల్లాలోని 107 సొసైటీ లకు అప్కాబ్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఆమేరకు జిల్లా స్థాయి లో తీసుకున్న నిర్ణయం రాష్ట్ర స్థాయి అమలు మరియు పర్యవేక్షణ కమిటీ ఆమోదం నిమిత్తం పంపుతున్నట్లు మాధవీలత తెలియ చేశారు.ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి వై. ఉమా రావు, డిసిసిబి ముఖ్య కార్యనిర్వహణధికారి ఆర్ వి నరసింహ రావు, కాకినాడ , ఏలూరు డి పి డి ఎం – బి. తేజా, పి. కొండల రావు లు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News