Breaking News

బంగారుకొండ విజయవంతం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి

-జూన్ 20 నుంచి కిట్స్ పంపిణీ
-సాప్ట్ వేర్, బంగారు కొండ యాప్ పై శిక్షణజేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
” బంగారుకొండ ” ద్వారా ఒక ఛాలెంజింగ్ కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టామని, అమలుతీరు ద్వారా మాత్రమే విజయవంతం సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు పేర్కొన్నారు.శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులతో బంగారుకొండ వెబ్ సైట్, యాప్ వినియోగం పై ఐ సి డి ఎస్ పిడి విజయ కుమారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, బంగారు కొండ ద్వారా బలహీనంగా ఉన్న, వయస్సుకు తగ్గ ఎత్తు, బరువుకు తగ్గ ఎత్తు లేని పిల్లలను ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. పిల్లల విషయంలో బాలమిత్రాలు తీసుకునే వ్యక్తిగత శ్రద్ద చాలా కీలకం కానున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా ఒక కొత్త ఆలోచన ప్రారంభించే క్రమంలో సవాళ్ళను ఎదుర్కొనే విధానం ద్వారా మాత్రమే విజయవంతం కావడం సాధ్యం అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందచేస్తున్న సంపూర్ణ పోషణ విధానంలో ఇంకా ఎక్కువ స్థాయి లో పోష్టిక ఆహారం అవసరం గుర్తించి జిల్లాలో వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి బంగారుకొండ రూపుదిద్దామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క పిల్లవాని దశల వారీగా పురోగతి వివరాలు మానిటరింగ్ చార్ట్ నందు నమోదు చెయ్యవలసి ఉంటుందని తెలిపారు.విజయ కుమారీ మాట్లాడుతూ, జూన్ 19 నాటికి మండల కేంద్రాలకు కిట్స్ పంపిణీ చేయడం, శిక్షణ ఇవ్వడం జరుగు తుందన్నారు. జూన్ 20 నుంచి బాలమిత్ర లకు కిట్స్ అందచేసి వాటి వివరాలు పోర్టల్, యాప్ లో అప్లోడ్ చెయ్యాలని తెలిపారు.అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఐ సి డి ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *