Breaking News

ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలందించే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సురక్ష సర్వే వాలంటీర్ మొబైల్ యాప్ ద్వారా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు, నగర పాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ ఫుడ్కర్, స్థానిక కార్పొరేటర్ కె. అంబేద్కర్ తో కలిసి 4వ డివిజన్ 16వ సచివాలయం పరిధి వరలక్ష్మి నగర్ లో వాలంటీర్ నిరీక్షణ కుమార్ మొబైల్ యాప్ ద్వారా ఎన్. స్మితశ్రీ, పి. జాషువ, గుడూరి నిర్మల కుటుంబాలకు సంబంధించిన వివరాలను పరిశీలించి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరించే విధానాన్ని, సమస్యలను సమస్యలను ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు.ఈ సంధర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం వినూత్న కార్యక్రమమని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని 16 మండలాలు, 4 మున్సిపాల్టీలు, విజయవాడ నగరపాలక సంస్థ తో కలిపి మొత్తం 605 గ్రామ, వార్డు సచివాలయాలలోని 10,256 మంది వాలంటీర్లు వారికీ కేటాయించిన గృహాలకు వెళ్లి వాలంటీర్ యాప్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన, సంక్షేమ పథకాలు వారికీ అందుతున్న తీరును నిర్దేశించిన ప్రశ్నవళిని పూర్తిచేస్తారన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి ఇంటి వద్దే డాక్యూమెంట్స్ ను సేకరించే విధంగా ఈ కార్యక్రమం ఉందన్నారు. నేటి నుండి వారం రోజల పాటు వాలంటీర్ మొబైల్ యాప్ ద్వారా సచివాలయాల సిబ్బందితో టీం సభ్యులు ప్రతి గృహాన్ని సందర్శిస్తారన్నారు. అర్హత ఉండి లబ్ది అందని వారిని గుర్తించి లబ్ది అందకపోవడానికి గల కారణాలను తెలుసుకొని సమస్య పరిష్కరించేందుకు అవసరమైన పత్రాలు సేకరిస్తారన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం ఉండదని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తమ ఇంటి వద్దకే వచ్చి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించేందుకు టోకెన్లు అందిస్తారని వీటికి సంబంధించి పత్రాలను జులై 1వ తేదీన నిర్వహించే ప్రత్యేక క్యాంపులలో అందజేస్తారని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.నగర పాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ ఫుడ్కర్ మాట్లాడుతూ వాలంటీర్లు తాము వచ్చే సమయాన్ని ఇంటి యజమానికి ముందుగానే సమాచారం అందిస్తారన్నారు. ఇంటి యజమాని 30 నిమిషాలను వాలంటీర్లకు కేటాయించి వారికీ అందుబాటులో ఉండాలన్నారు. వారి సమస్యలను తెలుసుకొని టోకెన్ నెంబర్ ను జారీ చేస్తారన్నారు. జులై 1వ తేదీన రెవిన్యూ, సచివాలయ సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులు క్యాంపులను నిర్వహించే రోజు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారని కమీషనర్ తెలిపారు.వరలక్ష్మి నగర్ లోని నివాసం ఉంటున్న ఎన్. స్మితశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమలాంటి పేద కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని తమకు వణుకూరులో ఇంటిపట్టా మంజూరైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన ఆధార్ కు మొబైల్ నెంబర్ ను అనుసంధానం చేయాలని కోరారు.పి. జాషువ తనకు(బిసి.సి) కుల దృవీకరణ పత్రం అవసరమని, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుకు తన కుమార్తె పేరును కూడా నమోదు చేయాలని కోరారు.గుడూరి నిర్మల తన కుటుంబానికి అందిస్తున్న వైఎస్సార్ చేయూత పథకం తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని దానిని తిరిగి కొనసాగించాలని కోరారు.క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ అడిషనల్ కమీషనర్ కెవి. సత్యవతి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *