Breaking News

తప్పులు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఇఆర్‌వోలు, ఏఇఆర్‌వోలు, అన్ని పార్టీలు తమ సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు కోరారు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం స్థానిక కలెక్టరేట్‌ క్యాంప్‌ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుందు స్పెషల్‌ సమరీ రివిజన్‌ 2024లో భాగంగా స్వచ్చమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు కార్యచరణపై ఇఆర్‌వోలు, ఏఇఆర్‌వోలు, రాజకీయపార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 21వ తేది నుండి ఆగస్టు 21వ తేది వరకు నిర్వహించే డోర్‌టు డోర్‌ వెరిఫికేషన్‌ పై బూత్‌ స్థాయి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు రాజకీయపార్టీలబూత్‌ లెవల్‌ ఏజెంట్ల సమన్వయం చేసుకోవాలన్నారు. బూత్‌ లెవల్‌ ఏజెంట్ల జాబితాను నియోజవర్గాలు, పోలింగ్‌ స్టేషన్ల వారిగా బూత్‌ లెవల్‌ ఎజెంట్ల జాబితాలో జిల్లా ప్రెసిడెంట్‌, సెక్రటరీ సంతకం తప్పనిసరిగా ఉండాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టకుని, తుది జాబితా రూపొందించేందుకు బూత్‌ స్థాయి అధికారులు నిరంతర ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఏఇఆర్‌వోలకు బిఇఆర్‌వోలకు నెల రోజులపాటు సాంకేతికతపై పూర్తి స్థాయి శిక్షణ పొందలన్నారు. డోర్‌ టు డోర్‌ వేరిఫికేషన్‌ పక్కాగా జరగాలన్నారు. వెరిఫికేషన్‌ సమయంలో డోర్‌ నెంబర్‌ లేని, ఒకే డోర్‌ నెంబర్‌లో ఉన్నవి, పేర్లు సరిగ్గా లేనివి, 18 సంవత్సరాలు నిండిన యవతను బిఎల్‌వోలు గుర్తించాలన్నారు. నగరంలో అపార్టిమెంట్లు ఎక్కువగా ఉన్నందున ఆయా అపార్టిమెంట్లలో నివాసించే ఓటర్లకు డోర్‌ నెంబర్‌తోపాటు ఫోర్‌, ఫ్లాట్‌ నెంబర్‌ ఉండేలా బిఎల్‌వోలు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే వ్యక్తికి పలు చోట్ల ఓటర్‌గా నమోదు అయి ఉన్న, ఫోటో నాణ్యత సరిగ్గా లేకపోయిన, వేరే ఫోటో ఉన్న వాటిని గుర్తించాలన్నారు. ఆగస్టు 22 నుండి సెప్టెంబర్‌ 29వ తేది వరకు నిర్వహించే రేషనలైజేషన్‌ ప్రక్రియలో భాగంగా ఒక ప్రాంతంలో 1,500 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లైయితే కొత్త పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించుకోవాలన్నారు. అక్టోబర్‌ 15వ తేది నుండి నవంబర్‌ 30వ తేది వరకు క్లయిమ్స్‌, అభ్యంతరాలను ఫిల్లింగ్‌ చేసుకుని డిసెంబర్‌ 26వతేదిన పరిష్కరించాలన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి 2024 జనవరి 5వ తేది నాటికి తప్పులు లేని ఖచ్చితమైన ఫైనల్‌ ఎలక్ట్రోరల్‌ రోల్‌ సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఇఆర్‌వోలు, ఏఇఆర్‌వోలను ఆదేశించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టకుని, ఎన్నికల అధికారులకు, రాజకీయపార్టీలకు ఓటర్ల జాబితా రూపకల్పనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలో ఏడు నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం ఉన్నాయన్నారు. జిల్లాలో ప్రస్తుతం 23 లక్షల 46 వేల 711 మంది జనాభా ఉన్నారన్నారు. ఈ ఏడాది 2023 జనవరి 5వ తేదిన ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో 16 లక్షల 31 వేల 883 మంది ఓటర్లు నమోదై ఉందన్నారు. ఈ నెల 22వ తేది నాటికి జిల్లాలో 15 లక్షల 98 వేల 512 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. ప్రస్తుతం జిల్లాలో జనాభాతో ఓటర్ల నిష్పత్తి 680గా నమోదై ఉందన్నారు. జిల్లాలో 1,779 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని ఏడుగురు ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, 36 మంది అసిస్టెంట్‌ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు ఉన్నారన్నారు. జిల్లాలో యువ ఓటర్ల నమోదు పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని జిల్లాలో 18 నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన 50 వేల మంది యువ ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నామని, 16 వేల మందికి పైగా నమోదు చేశామని, మిగిలిన వారినికూడా బిఎల్‌వోలు డోర్‌టుడోర్‌ వెరిఫికేషన్‌లో నమోదు చేసేలా ఆదేశించామన్నారు. 100 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉన్న సుమారు 226 ఓటర్లను పూర్తిగా వెరిఫికేషన్‌ చేయాలని ఆదేశించామన్నారు. ఒకే డోర్‌ నెంబర్‌లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని నిష్పక్షపాతంగా సజావుగా ఓటర్ల జాబితా సిద్దం చేస్తున్నామని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.సమవేశంలో పాల్గొన్న ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు నరహరశెట్టి నరసింహారావు, పి. ప్రభుదాస్‌, బి. కిరణ్‌కుమార్‌, వైఎస్సార్‌ సిపి ప్రతినిధి వై. ఆంజనేయరెడ్డి, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి సిహెచ్‌ కోటేశ్వరరావు, తెలుగుదేశపార్టీ ప్రతినిధి వి మునియ్య, భారతీయ జనతాపార్టీ ప్రతినిధి బి.శ్రీథర్‌, బహుజన సమాజ్‌ పార్టీ ప్రతినిధి బి. బాబురావులు మాట్లాడుతూ ఓటర్లు, ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను భాగస్వామ్యం చేయరాదని, ఒక వార్డు నుండి మరో వార్డుకు ఓటర్ల మార్పులో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వివాహాం అయిన ఓటర్లు, డోర్‌ నెంబర్‌ లేని ఓటర్లు, పర్మినేట్‌ మిస్సింగ్‌, మరణించిన ఓటర్ల వేరిఫికేషన్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.సమావేశంలో నగర పాలక మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, ఇఆర్‌వోలు, ఏఇఆర్‌వోలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *