Breaking News

పిల్లలకు పోషకాహారం అందించుటకు ప్రజలు తోడ్పడాలి.కె.దినేష్ కుమార్, కమిషనరు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోషకాహార లోపం గల పిల్లలను దత్తత తీసుకొని వారిని ఆరోగ్యవంతులుగా తయారు చేయడంలో సహకరించాలని అన్నారు. జిల్లా యంత్రాంగం అధిక పోషకాహార లోపం గల పిల్లలకు పౌష్టికాహారాన్ని అందచేయుటకు నిర్ధేశించి ‘‘బంగారు కొండ’’ కార్యక్రమము ద్వారా కమిషనరు వారు, వారి సతీమణి దత్తత తీసుకొన్న గోరక్షణపేటలో నివశించుచున్న షేక్ ఫారూక్, గోపాల్ నగర్ పుంతలో నివశించుచున్న కొవ్వాడ దీక్షితల గృహాన్ని ఈ రోజు సందర్శించారు.వారి తల్లితండ్రులను పిల్లల యొక్క ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరు తమ తమ పరిధిలోని అంగన్ వాడి కేంద్రాలను సందర్శించి పోషకాహార లోపంతో ఉన్న పిల్లలకు తగిన పోషక పదార్థాలు అందచెయ్యడం లో తోడ్పాటు అందించాలని, వారిని ఆరోగ్యవంతులుగా చేయుటలో సహకరించాలన్నారు . తద్వారా భవిష్యత్తు కోసం మేరుగైన, ఆరోగ్యకరమైన, సమాజం ఏర్పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమములో గోపాల్ నగర్ పుంత మరియు గొరక్షణపెట సచివాలయ పరిధిలో ఆరోగ్య కార్యదర్శులు, అంగన్ వాడి టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *