Breaking News

అ అంటే అమ్మఒడి… ఆ అంటే ఆంధ్రప్రదేశ్

– ప్రభుత్వం ఉన్నత సంకల్పం తో విద్యా విధానం అమలు చేస్తోంది.
– జిల్లాలో అమ్మఒడి గా 1,55,768 తల్లుల ఖాతాలకు రూ.233.65 కోట్లు జమ చేసాం..
– ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చదువు కోవాలి
-హోం మంత్రి తానేటి వనిత
దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయడం జరిగిందని, చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి నమ్మిన వ్యక్తి జగన్ మామ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు.బుధవారం దేవరపల్లి లో అంబటి సత్యనారాయణ జిల్లా పరిషత్ హైస్కూల్ లో జిల్లా స్థాయి అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి వరుసగా నాలుగో ఏడాది జగనన్న అమ్మ ఒడి 2022-23 విద్యా సంవత్సరానికి సంబందించి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ మన రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదనే ఏకైక లక్ష్యం విద్య విధానంలో జగనన్న విన్నూత్న మార్పులు తీసుకుని రావడం జరిగిందన్నారు. తల్లితండ్రుల ఆశయలకు ఆలోచనలకు ఒక మేనమామగా పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో నాడు నేడు పనులు, అమ్మఒడి, గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం అందచేస్తున్న ఈ పథకాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి కోరారు. ప్రతి ఒక్కరు తప్పనసరిగా విద్యను అభ్యసించి ఉన్నత స్థానంకు చేరుకోవాలని హోం మంత్రి పిలుపు నిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగం లో వివిధ పధకాలు క్రింద గత 4 ఏళ్ళలో ఇప్పటి వరకు రూ.66,722.36 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కార్పొరేట్ స్కూల్స్ కూడా ప్రభుత్వ బడులతో పోటీపడేలా మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దు తున్నామన్నారు. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ డిజిటల్ విధానంలో బోధన దిశగా నాడు నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన తరగతి, ఆపైన ప్రతి తరగతికి ఆన్లైన్లో కూడా పని చేసేలా బైజూస్ కంటెంట్ తో కూడిన 62,000 పైచిలుకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేసామన్నారు. ఇంగ్లీషు మీడియం విద్య సీబీఎస్ సిలబస్ పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు, వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన, సీబీఎస్ సిలబస్ అనుసంధానం చేసామన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టామన్నారు.
ఎంపి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ జగన్ మామ కురుపాం గ్రామం నుంచి అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించారన్నారు. గతంలో నాణ్యమైన విద్యను అందించే పరిస్థితి ఉండేదు కాదని, నేడు జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత నాడు నేడు కింద పాఠశాలల ఆధునీకరణ మౌలిక సదుపాయాలు కల్పన చెయ్యడంతో పాటు పుస్తకాలు, డ్రెస్, షూస్, ముందుగానే అందించడం ద్వారా నాణ్యమైన విద్యను అందింస్తున్నారు. స్కూల్ నిర్వహణ కింద అమ్మఒడి కింద అందచేస్తున్న .15 వేలు లో రెండు వేల రూపాయలు స్కూల్ లో నిర్వహణ చేపట్టడం కోసం తల్లితండ్రులను భాగస్వామ్యం చేయడం ఇందులో ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. విమర్శించే వారికి విద్యా విధానంలో గతంలోను, ఇప్పుడు ఉన్న తేడా ఏ విధంగా ఉందనేది పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ చిన్నారులకు వీడియో ద్వారా చూపించడం ఆసక్తి గా నిలిచింది.జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ 4వ విడత అమ్మఒడి పథకం జిల్లా స్థాయి కార్యక్రమానికి హాజరైన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. విద్య కు భద్రత తో కూడి అందించాలనే లక్ష్యంతో అమ్మఒడి కార్యక్రమం అమలు చేశారన్నారు. ఉన్నత విద్యను అభ్యశించే విద్యార్థులకు మరింత మెలుకువులు నేర్చుకునే విధంగా సాంకేతిక అందించే ట్యాబ్ లు, బైజూస్, డిజిటల్ బోధన పద్ధతులను అందచెయ్యడం జరుగుతోంది అన్నారు. కష్టపడే తత్వం, హాజరు ద్వారా మాత్రమే ఉన్నతమైన కెరీర్ సాధ్యం అవుతుందన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు తో పాటు బైజూస్ కంటెంట్ తో పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతిలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థికి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్ లైన్లో కూడా పని చేసేలా బైజాన్ కంటెంట్ తో కూడిన ఉచిత టాబ్ లను పంపిణీ చేసామన్నారు.సభాధ్యక్షులు ఎమ్ఎల్ఏ తలారి వెంకట్రావు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాకు చెంది గోపాలపురం నియోజక వర్గం పరిధిలోకి వచ్చే గోపాలపురం, దేవరపల్లి, నల్లజెర్ల ద్వారకాతిరుమల మండలాలకు చెందిన సుమారు 27 వేల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో ఈ ఏడాది రూ.41 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూ జగనన్న సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయడం జరిగిందన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను మరింత పటిష్టపరుస్తూ ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా బలోపేతం చేస్తున్నారన్నారు.కార్యక్రమంలో శాసన సభ్యులు తలారి వెంకట్రావు, జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, డిఈఒ ఎస్.అబ్రహం, ఎమ్ పిపి కే. వి. కే. దుర్గారావు, ఏఎమ్ సి చైర్మన్ గన్నమని జనార్ధన రావు, సర్పంచ్ కడిమి వీర కుమారి, ఫామాయిల్ బోర్డు రాష్ట్ర డైరెక్టర్ నరహరశెట్టి రాజేంద్ర బాబు, శాప్ డైరెక్టర్ కవ్వాల వరలక్ష్మి, జెడ్పిటిసి చిగురుపల్లి సామియేలు, ప్రధానోపాధ్యాయులు కే. శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యారనీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *