Breaking News

యుపిఎస్‌సి పరీక్షలకు పకడ్బందీఏర్పాట్లు చేయండి…

-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌/ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పరీక్షకు 7,890,
-అసిస్టెంట్‌ ప్రోవిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ పరీక్షకు 7,955 మంది హాజరు..
-నగరంలో 17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢల్లీిరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యుపిఎస్‌సి ద్వారా నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢల్లీి రావు అధికారులను ఆదేశించారు.
జూలై నెల 2వ తేదీ ఆదివారం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌/ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ పరీక్షల నిర్వహణకు చేయవలసిన ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢల్లీి రావు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 2వ తేది ఉదయం 9:30 నుండి 11:30 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌/ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పరీక్ష, మధ్యాహ్న 2:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌/ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పరీక్షకు 7,890 మంది అభ్యర్థులు, అసిస్టెంట్‌ ప్రోవిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ పరీక్షకు 7,955 మంది మొత్తంగా 15,845 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు నగరంలో 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పటమట కెబిసి జిల్లా పరిషత్‌ బాయ్స్‌ హైస్కూల్లో ఉదయం 57మంది మధ్యాహ్నం 46 మంది మొత్తంగా 103 మంది విభిన్న ప్రతిభావంతులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు 780 మంది ఇన్విజిలేటర్లు, 54 మంది అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు, 19 మంది లైజనింగ్‌ ఆఫీసర్లు, 17 మంది వెన్యూ సూపర్‌వైజర్లు పర్యవేక్షించ నున్నారన్నారు. పరీక్షల ఓవరాల్‌ ఇన్‌స్పెక్టింగ్‌ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌, కస్టోడియన్‌ అధికారిగా డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు వ్యవహరిస్తారన్నారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనేలా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బందితో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులను,విద్యుత్‌ అంతరాయం కలుగకుండా చూడాలని ఎపిఈపిడిసిఎల్‌ అధికారులను, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్‌ ఢల్లీి రావు ఆదేశించారు.ఈ సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, ఆర్‌డివో రవీంద్రరావు, అడిషనల్‌ కమీషనర్‌ శ్యామల, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, విద్యుత్‌, ఆర్టీసీ, జీవీఎంసీ, పోలీస్‌, పోస్టల్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *