Breaking News

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి …..కె.దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాల సీజను ప్రారంభమై నందున నగరములో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబల కుండా తగు ముందస్తు చర్యలు తీసుకొవాలని కమిషనర్ కె. దినేష్ కుమార్ ఆదేశించారు .బుధవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశము నిర్వహించినారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ కెదినేష్ కుమార్ మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల వ్యాప్తి పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు. హెల్త్ సెక్రెటరీల ద్వారా ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు ఇంటింటి సర్వే నిర్వహించి జ్వర కేసులు ఉన్నయెడల సమీపములోని అర్బన్ హెల్త్ సెంటర్ కు సిఫార్సు చేసి తగిన వైద్య సదుపాయము కల్పించాలన్నారు. . కాలువలలో మురుగును ఎప్పటికప్పుడు తొలగించాలని శానిటేషన్ సిబ్బంది, సచివాలయ శానిటరీ సహాయకులకు సూచనలు చేశారు. నగరములోని అర్బన్ హెల్త్ సెంటర్లలో టైఫాయిడ్ నిర్ధారణ కిట్లు వెంటనే సరఫరా చేయవలసినదిగా జిల్లా వైద్య శాఖాధికారిని కమిషనర్ కొరారు. నగరంలోని అన్నీ అర్బన్ హెల్త్ సెంటర్లకు ఎన్ని కిట్లు కావాలో వెంటనే మదింపు చేసి వెంటనే తెలియజేయాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులను ఏదుర్కోవడానికి సర్వ సన్నద్దముగా ఉండాలని అన్నారు.ఈ సమావేశములో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. ఎ. వినూత్న, శానిటరి సూపర్ వైజర్ ఇంద్రగంటి శ్రీనివాస్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసరు సిహెచ్.శ్రీనివాసరాజు, అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యాధికారులు, జిల్లా మలేరియా ఆఫీసర్, సబ్ యూనిట్ ఆఫీసర్, నగరపాలక సంస్థ శానిటరి సూపర్ వైజర్లు మరియు హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *