Breaking News

జగనన్న సురక్ష కింద బుదవారం సాయంత్రం వరకు 32,734 ఇళ్లను సందర్శించి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :

జగనన్న సురక్ష కింద బుదవారం సాయంత్రం వరకు 32,734 ఇళ్లను సందర్శించి డేటా సేకరణ చేపట్టడం జరిగిందని, నూరుశాతం ఇళ్లను వాలంటీర్లు సందర్డుంచేలా చర్యలు తీసుకుంతున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలిపారు.బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా తాడేపల్లి నుంచి జిల్లా కలెక్టర్ల తో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జేసీ తేజ్ భరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో ఉన్న 6,45,396 ఇళ్లను సందర్శించి లబ్దిదారుల నుంచి సమగ్ర సమాచారం తీసుకోవడం జరుగుతుందని అన్నారు . ఆ క్రమంలో ఇప్పటి వరకు4103 సచివాలయాలకు చెందిన 1818 మంది వాలంటీర్లు ఇంటింటి సర్వే ప్రక్రియలో పాల్గొనడం జరిగిందన్నారు. ఇప్పటి 32, 734 గృహాలను సందర్శించి సర్వే చేపట్టి ఆయా వివరాలు డిజిటల్ సహాయకులు ద్వారా ఎప్పటి కప్పుడు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సర్వే లో భాగంగా ఇంకా సంక్షేమ పథకాలను పొందేందుకు అర్హత ఉండి ఇంకా అందకుండా ఉన్న వాటి వివరాలు తీసుకుని వాటికి అనుగుణంగా డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వాటిని అందచేసే ప్రక్రియ సమాంతరంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఒక్క ఇంటినీ ఈ సర్వే సమయంలో వదలకుండా క్షేత్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే దిశగా డివిజన్ పరిధిలో ముగ్గురు, ప్రతి మండలం లో ఒక జిల్లా అధికారి పర్యవేక్షణ చేస్తున్నట్లు మాధవీలత తెలిపారు.జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, తొలి దశలో నిర్వహిస్తూన్న సర్వే విషయంలో ఆయా గ్రామ వార్డు సచివాలయం పరిధిలో నిర్వహించే గ్రామ / వార్డు సభలకు చెందిన షెడ్యూల్ అనుగుణంగా ఇంటింటి సర్వే ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు .డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు పి. వీణా దేవి, వి. శాంతమణి, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *