Breaking News

సచివాలయ వ్యవస్థతో పరిపాలన ప్రజల వద్దకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వం

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ వ్యవస్థతో పరిపాలన ప్రజల వద్దకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ప్రజల కోసమే అని రాష్ట్ర ముఖ్యమంత్రి రుజువు చేశారని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం స్థానిక మారుతినగర్ మెయిన్ రోడ్ లో ఎంఎల్సి చంద్రగిరి ఏసురత్నం, ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జగనన్న సురక్ష క్యాంప్ జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పధకాలకు మిగిలిపోయిన అర్హులు, సమస్యలను గుర్తించేందుకు ప్రతి ఇంటిని సందర్శించేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్షా కార్యక్రమం నెలరోజుల పాటు చేపట్టనున్నదని, ప్రతి గడపకు వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు వెళ్ళేలా కార్యాచరణ రూపొందించారని పేర్కొన్నారు. సదరు కార్యక్రమంలో భాగంగా గత వారం రోజుల నుండి 39వార్డ్ లో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివిధ పధకాలకు లబ్దిదారుల అర్హుల వివరాలు, అవసరమైన ధ్రువపత్రాల ఆర్జీలను సేకరించారన్నారు. డివిజన్ పరిధిలోని 5 సచివాలయాల్లో శనివారం క్యాంప్ ద్వారా షుమారు 12 వందల సర్టిఫికెట్స్ అందిస్తున్నామని, వాటిలో అధిక శాతం ప్రస్తుతం విద్యా సంవత్సరానికి అవసరమైన ఇన్కం, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. అలాగే వార్డ్ సచివాలయం పరిధిలో ఎటువంటి ప్రభుత్వ సేవలు అయినా సంబందిత కార్యదర్శి ద్వారా పొందవచ్చన్నారు. జగనన్న సురక్ష లో భాగంగా డివిజన్లలో స్తానిక సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామని తెలిపారు.ఎంఎల్సి మాట్లాడుతూ మహత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నేడు జగన్మోహన రెడ్డి సాకారం చేశారన్నారు. జగనన్న సురక్ష ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అవసరమైన ధ్రువపత్రాలు, పధకాలు చేరువ చేయడం జరుగుతుందన్నారు. పేదలు ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వ అధికారులనే వారి వద్దకు పంపిన ఘనత ముఖ్యమంత్రి దే అని అన్నారు. నగర కమిషనర్ నగర సమగ్రాభివ్రుద్దికి విశేష కృషి చేస్తున్నారనంరు.ఎంఎల్ఏ మాట్లాడుతూ గతంలో అవసరమైన ధృవీకరణ పత్రాలు కావాలి అంటే వేలకు వేలు ఖర్చుతో పాటు, నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఇంటి ముందుకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. ప్రతి నెల 1 నె పించన్ కూడా ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్ధికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలోకి రావాలనే ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే విద్యా విద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తునారని తెలిపారు. విద్యా వ్యవస్థలో ప్రస్తుతం వచ్చిన విప్లవాత్మక మార్పుల వలన భవిష్యత్ తరాలకు భరోసాని ముఖ్యమంత్రి ఇచ్చారన్నారు.
అనంతరం సురక్ష క్యాంప్ లో వివిధ అంశాల్లో దరఖాస్తు చేసుకున్న వారికీ ధ్రువపత్రాలను అందించారు.జగనన్న సురక్ష క్యాంప్ లు శనివారం మారుతి నగర్, నల్ల చెరువు 22 వ లైన్, పాత గుంటూరు మణి హోటల్ సెంటర్, నల్ల చెరువు 6 వ లైన్, పాత గుంటూరు అంజనేయ స్వామి గుడి, బుడం పాడు వార్డ్ సచివాలయం దగ్గర జరిగాయని, 6 ప్రాంతాల్లో కలిపి వివిధ రకాల 5949 సర్టిఫికెట్స్ అందించండం జరిగిందని కమిషనర్ తెలిపారు.కార్యక్రమంలో కార్పొరేటర్ షేక్ జుమ్మాబి, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, డి.ఈ.ఈ. మహ్మద్ రఫిక్, పశ్చిమ తహసిల్దార్ సాంబశివరావు, నోడల్ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *