విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా పరిపాలన ను ప్రజల వద్దకు చేరువ చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ది అందజేయడమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మన తూర్పు నియోజకవర్గంలో నేడు 4వ డివిజన్ నెల్సన్ మండేలా పార్క్ నందు 16,17,18,21 సచివాలయాలకు సంబంధించి, 5వ డివిజన్ ఆరుల్ నగర్ నందు 15,19,20,22 సచివాలయాలకు సంబంధించిన ప్రజల వద్ద నుండి సబ్ కలెక్టర్ శ్రీమతి అతిధి సింగ్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ శ్రీమతి సత్యవతి, వైసీపీ నగర అధ్యక్షలు శ్రీ బొప్పన భావ కుమార్,రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ కడియాల బుచ్చిబాబు,డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ,జోనల్ కమిషనర్లు కృష్ణ,రవి చంద్ గార్లతో కలిసి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు అర్జీలు సేకరించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.గత 10రోజులుగా వలంటీర్లు చేసిన సర్వేలో దాదాపు 718 మందికి సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందలేదు అని వారి దృష్టికి తీసుకురాగా నేడు జగనన్న సురక్ష కార్యక్రమంలో వారందరికీ ఇన్ కం, కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గృహసారథులు,కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జిలు,వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు,వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు, ఇంచార్జిలు,డివిజన్ ప్రెసిడెంట్లు,వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,సోషల్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News