Breaking News

జిల్లాలో ప్రాధాన్యత భవనాలు పూర్తి చేసివని త్వరలో అందచెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త:
గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి ఇతర అధికారులు వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్  ద్వారా కలెక్టర్ లతో రెవెన్యూ, రీ సర్వే, భూసేకరణ, పర్యాటక రంగం భూ అంశాలు, స్పందన రెవెన్యూ అర్జీలు, జేకేసి, వ్యవసాయ అనుబంధ రంగాలు, పంచాయతీ రాజ్, ఉపాధిహామీ వేతనాలు, తదితర అంశాలపై కలెక్టర్ల తో , జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ లు స్థానిక కలెక్టరేట్ విసి హలు నుంచి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా ప్రగతి ని వివరిస్తూ, జగనన్నకు చెబుదాం కు చెంది పెండింగ్ అర్జీలపై  సహేతుకమైన వివరణ ఇస్తూ ముగింపు చెయ్యడం పై క్షేత్ర స్థాయి అధికారులకు సూచనలు జారీ చేసినట్లు మాధవీలత తెలిపారు.  స్పందన కు చెందిన రెవెన్యూ అర్జీలను తక్షణం పరిష్కారం చూపాలని అన్నారు.జేకేసి కు చెంది మొత్తం 3292 అర్జీలు రాగా , 2470 పరిష్కారం చేశామన్నారు. 233 రీ ఓపెన్ అయిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని అన్నారు. అర్జిలకు చెందిన 37 ఆడిట్ పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. వాటిని శాఖల వారీగా సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో టూరిజం కు చెందిన భూ సేకరణ కోసం 6 ప్రాజెక్ట్స్ ప్రతిపాదించగా 3 ప్రతిపాదనలు సి సి ఎల్ ఏ కు పంపడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఒక ప్రాజెక్ట్ కి సంబందించిన భూములను ముందస్తు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 15,803 మంది రైతులు వివరాలు ఈ కేవైసి చేపట్టవలసి ఉందని, ఇందుకోసం అర్భికే వారీగా లబ్దిదార రైతులను గుర్తించి ఈ కేవైసి పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ 5మాధవీలత తెలిపారు. కిసాన్ డ్రోన్ పైలేట్ శిక్షణ కోసం జిల్లాకు 20 యూనిట్స్ లక్ష్యం ఇవ్వగా ఇప్పటి వరకు 14 యూనిట్స్ రైతుల నుంచి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, మిగిలిన 6 యూనిట్స్ కోసం 5 సభ్యులతో కూడిన బృందాలను గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటామని, వారిలో ఒకరు ఇంటర్ చదివిన నిరుద్యోగ యువత ఉండలని పేర్కొనడం జరిగిందన్నారు. జగనన్న పాల వెల్లువ ప్రగతి సాధించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రాధాన్యత భవనాలు నిర్మాణం కోసం పై కప్పు స్థాయి, పై కప్పు వేయబడిన, పూర్తి అయ్యే స్థాయి భవనాలు పై వాటిని తదుపరి స్టేజ్ కోసం సమయ పాలన పరంగా తేదీలను నిర్ణయిస్తూ క్షేత్ర స్థాయి అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గ్రామ సచివాలయ భవనాలు పై కప్పు స్థాయి లో 6, పై కప్పు వేసినవి 9, సెకండ్ స్లాబ్ లో 3 , పూర్తి చేసిన స్థాయి లో 32 ఉన్నాయన్నారు. అర్భికే భవనాలు పై కప్పు స్థాయి లో 2, , పై కప్పు వేసినవి 15 , పూర్తి చేసిన స్థాయి లో 38 ఉన్నాయన్నారు. వైయస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలు పై కప్పు స్థాయి లో 24 , పై కప్పు వేసినవి 13  , పూర్తి చేసిన స్థాయి లో 103 ఉన్నాయన్నారు.జగనన్న సురక్ష ద్వారా జిల్లాలో 103 గ్రామ, వార్డు సచివాలయల పరిధిలో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు. రానున్న 5 షెడ్యూల్ రోజుల్లో 137 సచివాలయాల్లో గ్రామ సభలు నిర్వహించే క్రమంలో 79 శాతం కుటుంబాలను సందర్శించి సర్వే పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఉపాధిహామీ పథకంలో జూలై నాటికి 33.85 లక్షల పని దినాలకు గాను 32.55 లక్షల మ్యాండిడేట్ పని దినాలు మ్యాపింగ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 39.66 కుటుంబాలకు సగటు పనిదినాలు కల్పన సాధించడం జరిగిందని అన్నారు.  హార్టికల్చర్ కింద 300 ఎకరాల లక్ష్యం కు గాను 265 అంచనా వేసి, 244 ఎకరాలకు పరిపాలన ఆమోదం ఇచ్చినట్లు పేర్కొన్నారు.2వ విడత రీ సర్వే లో భాగంగా జిల్లాలో 10 గ్రామాల్లో రీ సర్వే చేపట్టనుండగా 5 గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పనులు చేపట్టడం జరుగుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. తొలి రెండు దశల్లో 55 గ్రామాలకు గాను ఇప్పటి వరకు 46 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసినట్లు తెలియ చేశారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, టూరిజం ఈ డి వి. స్వామి నాయుడు, ఇతర జిల్లా అధికారులు  పిడి డ్వామా జీ ఎస్ రామ్ గోపాల్, పిఆర్ ఎస్ ఈ ఏ బి వి ప్రసాద్, సిపివో  ఏ. ముఖ లింగం, , డిపివో  జేవీఎస్ సత్యనారాయణ, డి ఎ వో ఎస్.. మాధవరావు, ఇంఛార్జి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఎస్. సుభాషిణి మార్కెటింగ్ ఎ డి ఎమ్.సునీల్ వినయ్, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *