రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద వచ్చే ప్రమాదం ఉన్న దృష్ట్యా కంట్రోల్ రూం లను ఏర్పాటు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వారి కార్యాలయములో , రెవిన్యూ డివిజినల్ ఆధికారి వారి కార్యాలయము, రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు నందలి కంట్రోలు రూములు ఏర్పాటు చేయడమైనదని కలెక్టర్ తెలిపారు.జిల్లా మరియు డివిజినల్ స్థాయి కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంచడం కోసం షిఫ్ట్ ల వారిగా సిబ్బందికి డ్యూటీలు వెయ్యడం జరిగిందన్నారు.జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము, తూర్పు గోదావరి జిల్లా – 8977935609రెవిన్యూ డివిజినల్ ఆధికారి వారి కార్యాలయము, రాజమహేంద్రవరం -0883-2442344రెవిన్యూ డివిజినల్ ఆధికారి వారి కార్యాలయము, కొవ్వూరు -9440295493ఇందుపై తెలియచేయడమేమనగా, వరద వచ్చే అవకాశము ఉన్నందున, గోదావరి పరివాహక గ్రామాలు, లంక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మరియు ప్రాణ, ఆస్థి, పంట, పశుసంపదలకు నష్టం వాటిల్లకుండా చూసుకొనుటకు , ఆనేపథ్యం సమాచారం అందించడం కోసం కంట్రోలు రూం ఏర్పాటు చేయడమైనదన్నారు. సదరు పైన తెలిపిన కంట్రోలు రూమ్ నెంబర్లకు వెనువెంటనే సమాచారము అందించవలసినదిగా కోరడమైనది.
Prajavartha Online Telugu News