మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 22వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోర్టుల పరిధిలో ఈ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మోటార్ యాక్సిడెంట్ కేసులు, భూసేకరణ అంశాలలోని కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కనుక కక్షిదారులు తమ లాయర్లను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Prajavartha Online Telugu News