రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ICAR- CTRI) ద్వారా దక్షిణ ప్రాంత తేలిక నేలల్లో, ఉత్తర ప్రాంత తేలిక నేలలు మరియు బర్లీ ప్రాంతాలకు అనువైన మూడు అధిక దిగుబడులనిచ్చే పొగాకు వంగడాలు విడుదల చేశారని సి.టి.ఆర్.ఐ. డైరెక్టర్ డా॥ మాగంటి శేషుమాధవ్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
FCR-15 (సి.టి.ఆర్.ఐ. శ్రేష్ఠ) : దక్షిణ తేలిక నేలలకు అనువైన అధిక దిగుబడినిచ్చే (హెక్టారుకు 3,000 కిలోలు), శీతాఫల తెగులు తట్టుకునే బ్యారన్ పొగాకు రకము.FCJ-11 (సి.టి.ఆర్.ఐ. నవీన) : ఉత్తర తేలిక నేలలకు అనువైన అధిక దిగుబడినిచ్చే (హెక్టారుకు 3,300 కిలోలు), తక్కువ నత్రజనితో సాగు సామర్ధ్యం కలిగిన బ్యారన్ పొగాకు రకము.YB-22 (విజేత) : అధిక దిగుబడినిచ్చే (హెక్టారుకు 2,900 కిలోలు) మరియు శీతాఫల తెగులు తట్టుకునే బర్లీ పొగాకు వంగడం.ఈ మూడు వంగడాలను స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటి (SVRC), ఆంధ్రప్రదేశ్ వారు విడుదల చేశారని ఆయన తెలియజేశారు. ఈ వంగడాల విత్తనములు ప్రస్తుత సీజనులో సి.టి.ఆర్.ఐ.లో లభ్యమవుతున్నాయని, వీటిని సాగుచేసుకుని, అధిక దిగుబడిని తద్వారా అధిక ఆదాయాన్ని పొందవలసినదిగా డా॥ మాగంటి శేషు మాధవ్ కోరడం జరిగింది.
Prajavartha Online Telugu News