Breaking News

విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలి

-సెమిస్టర్ 2 పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభించిన పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందేలా చర్యలు చేపట్టాలని, పాఠ్య పుస్తకాల కొరత వల్ల విద్యార్థులు చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  ప్రవీణ్ ప్రకాష్  అధికారులను ఆదేశించారు. గురువారం కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెమిస్టర్ -2 పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆ పాఠశాల ఉపాధ్యాయులకు సెమిస్టర్ 2 పుస్తకాల బండిళ్లను ప్రిన్సిపల్ సెక్రటరీ  ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎండీయూ (మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్) వాహనం ద్వారా పాఠశాలలకు అందించడం వల్ల ప్రధానోపాధ్యాయులకు ఆర్థిక భారం లేకుండా సకాలంలో విద్యార్థుల చేతుల్లోకి పుస్తకాలు చేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణ, ముద్రణల సంచాలకులు  రవీంద్రనాథ్ రెడ్డి, విజయవాడ పాఠ్య పుస్తకాల డిపో మేనేజర్  ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయురాలు వై దుర్గాభవాని, మండల విద్యాశాఖాధికారి శేషగిరి రావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *