-జిల్లాలో ఇప్పటిదాకా 46,281 సి సి ఆర్ సి కార్డుల జారీ
-సంక్షేమ పథకాలు పొందడంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఈ క్రాప్ బుకింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం చైర్మన్ జన్ను రాఘవరావు అధ్యక్షతన, జాయింట్ కలెక్టర్, సంబంధిత అధికారులతో కలసి నిర్వహించారు. చైర్మన్ జన్ను రాఘవరావు మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, రైతులకు అవసరమైన పరిమాణంలో విత్తనాలు, ఎరువులు ఆర్ బి కే లలో అందుబాటులో ఉంచాలని అన్నారు. సాగునీటి కాలువలు డ్రైన్లలో పూడిక తీత పనులు, గుర్రపు డెక్క, తూడు తొలగింపు వంటి నిర్వహణ పనులు వేగవంతం చేయాలని, రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా, ముఖ్యంగా శివారు ప్రాంతాల రైతులకు సాగునీరు అందేలా చూడాలని అధికారులను కోరారు.
రెవిన్యూ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మండల స్థాయి సమావేశాలు నిర్వహించేలా చూడాలని, రైతులను చైతన్యం చేయాలని అన్నారు. వ్యవసాయ/ ఆక్వా రైతులకు విద్యుత్ కనెక్షన్లు సకాలంలో మంజూరు చేయడం, అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందేలా చూడాలన్నారు. రైతులు సంక్షేమ పథకాలు పొందడంలో ఇబ్బందులు ఏర్పడకుండా ఈ క్రాప్ బుకింగ్ జాగ్రత్తగా నిర్వహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఆర్బికేల పరిధిలో ఎరువులు, పురుగుమందులు నిల్వల కోసం గోడౌన్ల కొరత లేకుండా చూడాలన్నారు. పశువుల భీమా చాలా ఆలస్యం అయిందని ఆర్బికేల వద్ద పశువైద్యం అందుబాటులోకి తేవాలని అన్నారు. అంబులెన్స్ ల ద్వారా జిల్లాలో పశువైద్య సేవలు రైతుల ముంగిటకే ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.
జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ మాట్లాడుతూ మండల వ్యవసాయ అధికారులు మండల వ్యవసాయ సలహా మండలు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో తాసిల్దారులతో వచ్చే గురువారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహిస్తామని, రైతుల సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు సి సి ఆర్ సి కార్డుల జారీ విషయంలో జిల్లా లక్ష్యం 61,000 గా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఈ మేరకు సిసిఆర్సి కార్డుల జారీ వేగవంతం చేయాలన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్య నివేదిక సభకు సమర్పించారు.
అన్ని మేజర్ డ్రైన్లలో తూడు గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, ఆలమట్టి నుండి పులిచింతల ప్రకాశం బ్యారేజ్ వరకు సాగునీటి లభ్యత సమాచారం రైతులకు అందించాలని, తాళ్లపాలెం ఏరియాలో వేరుశనగ రైతులకు డిమాండ్ ఉన్న రకాలు విత్తనాలు సరఫరా చేసేలా చూడాలని కమిటీ సభ్యులు కోరారు
జిల్లా ఉద్యానాధికారి జె జ్యోతి మాట్లాడుతూ చిన్న గొల్లపాలెం ఏరియాలో హార్టికల్చర్ సాగు బాగుందని అయితే సెలినిటీ ఎక్కువగా ఉందనే కారణంతో బోర్లకు అనుమతులు ఇవ్వడం లేదని తెలుపగా
పాత రిపోర్ట్ లు పరిశీలించి ఏ ప్రాతిపదికన బోర్లకు అనుమతులు ఇవ్వడం లేదో పరిశీలించి, సెలినిటీ చెక్ చేసి అనుమతులు పునరుద్ధరించేలా చర్యలు చేపడుతామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ మరియు ఈనెల 25 నుండి వేలేరులో నిర్వహించు మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ అంశాలపై ప్రచారం నిమిత్తం జిల్లా ఉద్యాన శాఖ ముద్రించిన గోడ పత్రికలు ఈ సమావేశంలో ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, మత్స్యశాఖ, విద్యుత్ పశుసంవర్ధక సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News