Breaking News

బిఎల్‌వోలు డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌ పక్కాగా నిర్వహించండి.. జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు.

 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారదర్శక ఓటర్‌ జాబితా తయారీకి బూత్‌ లెవల్‌ అధికారుల (బిఎల్‌వో) సమగ్ర డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌ కీలకమని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
పశ్చిమ నియోజవకర్గంలోని భవానిపురం ఏకలవ్య నగర్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద పోలింగ్‌ కేంద్రం పరిధిలో శుక్రవారం ఆటో స్టాండ్‌ సెంటర్‌ డోర్‌ నెం 76-16-276లో బిఎల్‌వో యాప్‌ ద్వారా బిఎల్‌వోలు రాధ, సాయి సౌజన్య నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా పరిశీలనను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 16 లక్షల ఓటర్లు ఇప్పటికే నమోదై ఉన్నారన్నారు. పశ్చిమ నియోజవర్గంలో ఇప్పటివరకు 2 లక్షల 37 వేల 382 మంది ఓటర్లు ఉండగా 253 మంది బిఎల్‌వోలు క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలిస్తున్నారన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ`2024లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నేటి నుండి ఆగస్టు 21వ తేది వరకు బూత్‌ స్థాయి అధికారులు డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఓటర్ల జాబితాను పరిశీలిస్తారన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైన పోలింగ్‌ బూత్‌లో తగిన కారణాలను పరిశీలించి ఓటింగ్‌ శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. బిఎల్‌వోలు, ఓటర్‌ జాబితా పరిశీలనలో జాబితాలో డబుల్‌ ఎంట్రీలు, నకీలి ఓటర్ల గుర్తింపు, మరణించిన వారి ఓటర్ల తొలగింపు, 100 సవత్సరాలు నిండిన వారిని గుర్తించడం, డోర్‌ నెంబర్‌ లేకపోయినా, ఒకే డోర్‌ నెంబర్‌పై అధిక సంఖ్యలో ఉన్న ఓటర్ల పరిశీలన, సర్సీసు ఓటర్లు, ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల వివరాలు సరిచేయడం, దీర్ఘకాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓటర్లను వారి అనుమతితో ఏ నియోజకవర్గంలో ఉంచాలో తెలుసుకుని జాబితాలో ఉంచడం ఒక బూత్‌లో 1500 ఓటర్లకు మించి గుర్తిస్తే కొత్త బూత్‌కు సిఫార్సు చేయడం, ఫోటో ఓటర్‌ గుర్తింపు కార్డులలో మార్పులు చేర్పులు తప్పుఒప్పులు సరిచేయడం ప్రధానంగా నిర్వహించాలన్నారు. బిఎల్‌వోల ఓటర్ల జాబితా పరిశీలనను ఎఇఆర్‌వోలు అయిన సంబంధిత మండల తహాశీల్థార్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు.పరిశీలనలో కలెక్టర్‌ వెంట తహశీల్థార్‌ కాళీ లక్ష్మి, డిప్యూటి తహశీల్థార్‌ ధరియా ఉన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *