Breaking News

జిల్లాలో “వైఎస్ఆర్ నేతన్న నేస్తం” పథకం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“వైఎస్సార్ నేతన్న నేస్తం” పథకం ద్వారా 2023-24 సంవత్సరానికి గాను జిల్లాలో 916 మంది లబ్ధిదారులకు రూ.24 వేల చొప్పున రూ.2,19,84,000/- లు వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు.శుక్రవారం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి నేడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయ్యగా, స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మాధవీలత, స్థానిక ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత మాట్లాడుతూ చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి కుటుంబానికిఏడాదికి రూ.24 వేల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తు వారికి ఆర్థిక భరోసా ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఆ క్రమంలో గత 4 ఏళ్లలో రూ.96 వేలు జమ చేశారన్నారు.నేడు 2023-24 సంవత్సరానికి గాను జిల్లాలో 916 మంది లబ్ధిదారులకు రు. 2,19,84,000/- లు వారి బ్యాంకు ఖాతాలకు సిఎం జమ చేశారన్నారు.జిల్లాలో గత ఏడాది 9 చేనేత సహకార సంఘాలు ద్వారా రూ.232.01 లక్షల విలువ గ ల వివిధ రకాలు చేనేత ఉత్పత్తు లను విక్రయించి రు. 322.43 లక్షల మేర ఆదాయం పొందడం జరిగిందన్నారు. అదేవిధంగా సహకార రంగం నుంచి రూ.350.00 లక్షల వివిధ రకాల ఉత్పత్తులను రు. 280.00 లక్షల రూపాయలకు విక్రయాలు జరిగాయని పేర్కొన్నారు.50 సంవత్సరాలు కార్మికులను వృద్ధాప్యంలో ఆదుకోవాలని సంకల్పంతో జిల్లాలో 1362 మంది చేనేత కార్మికులకు ప్రతినెల నెలకు రు. 2,750 చొప్పున పెన్షన్ అందిస్తున్నా మన్నారు. వైయస్సార్ చేనేత పింఛన్ జిల్లా లో 2022-23 సంవత్సరంలో జిల్లాలోని “పులపర్తి సొసైటీ” లో రు.120.50 లక్షల విలువు గల ప్రాజెక్ట్ కు సంబంధించి 233 మంది లబ్ధిదారులకు రు.24.67 లక్షలు మొదటి విడతగా విడుదల అయ్యిందన్నారు. మురముండలో సొసైటీ లో  రు.190.50 లక్షల విలువు గల ప్రాజెక్ట్ కు సంబంధించి 557 మంది లబ్ధిదారులకు  రు.53.669 లక్షలు  మొదటి విడతగా నిధులు విడుదల అయ్యిందన్నారు.జిల్లాలో “వైఎస్ఆర్ నేతన్న నేస్తం” పథకం ప్రారంభించిన నుంచి ఇప్పటివరకు జిల్లాలో 2019-20 లో 759 మంది లబ్ధిదారులకు 1.82 కోట్లు, 2020-21 లో 881 మంది లబ్ధిదారులకు 2.11 కోట్లు, 2021-22 లో 819 మంది లబ్ధిదారులకు 1.97 కోట్లు, 2022-23 లో 883 మంది లబ్ధిదారులకు 2.12 కోట్లు, 2023-24 లో 916 మంది లబ్ధిదారులకు 2.20 కోట్లు అందజేయడం జరిగిందన్నారు.
జిల్లాలో మండలాలు వారి లబ్ధిదారుల వివరాలు :-
కడియం మండలం లో 678 లబ్ధిదారులకు రు. 1.63 కోట్లు,
రాజానగరం మండలం లో 15 లబ్ధిదారులకు రు. 3.6  లక్షలు,
సీతానగరం మండలం లో 6మంది లబ్ధిదారులకు రు. 1.44 లక్షలు,
రాజమహేంద్రవరం రూరల్ మండలం లో 19 లబ్ధిదారులకు రు. 4.56  లక్షలు,
రాజమహేంద్రవరం అర్బన్ మండలం లో 5 మంది లబ్ధిదారులకు రు. 1.20  లక్షలు,
అనపర్తి మండలం లో 48 మంది లబ్ధిదారులకు రు. 11.52  లక్షలు,
పెరవలి మండలం లో 12 లబ్ధిదారులకు రు. 2.88  లక్షలు,
బిక్కవోలు మండలం లో 54 మంది లబ్ధిదారులకు రు. 12.96  లక్షలు,
రంగంపేట మండలం లో 78 లబ్ధిదారులకు రు. 18.72  లక్షలు,
కోరుకొండ మండలం లో 1గాను రు. 24 వేల రూపాయలు
మొత్తం 916 మంది లబ్ధిదారులకు రు. 2,19,84,000/- లు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. లబ్దిదారుల మాటల్లో :-
రాజమండ్రి రూరల్ మండలం కాతేరు నివాసి గంపల వీరభద్ర రావు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు మేలు జరిగేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఈ ప్రభుత్వం పరిపాలన బాగుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వైయస్ఆర్ నేతన్న నేస్తం కింద ప్రతి ఏడాది రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు 5 విడతల్లో రూ. లక్షా ఇరవై వేలు ఇవ్వడం జరిగిందన్నారు. జగనన్న చేదొడు ద్వారా అండగా నిలిచారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒకటవ తేదీన ఉదయాన్నే ఇంటికి వచ్చి వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నారని, గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయలేదు అన్నారు. సిఎం కు ధన్యవాదాలు తెలుపు కుంటున్నానని అన్నారు.మురమళ్ళ, కడియం మండలం నివాసి చప్పటి గంగరాజు తన అనుభవాన్ని వివరిస్తూ నడిచే దేవుడు జగన్ మోహన్ రెడ్డిని, తన సుదీర్ఘ పాదయాత్ర సమయంలో చేనేత కార్మికుల కష్టాలు తెలుసుకుని నేనున్నాను అని భరోసా ఇచ్చి, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏడాది రూ.24 వేలు చొప్పున ఇప్పటివరకు రు.1.20 లక్షలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కి చేనేత కార్మికులు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. ఈ మొత్తాన్ని పెట్టుబడి సాయంగా పెట్టుకుని స్వంతంగా మగ్గం పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు.గతంలో ఏదైనా పథకం పొందాలంటే అందరి చుట్టూ తిరగాల్సి ఉంటుందని అన్నారు. జన్మ భూమి కమిటీ సిఫార్సు ఉంటేనే పథకాలు అమలు చేయడం జరిగే వన్నారు. నా భార్య దివ్యంగురాలు, ప్రతి నెలా వాలంటీర్ ఇంటికి వచ్చి రూ.3 వేలు పెన్షన్ సొమ్ము ఇస్తున్నారని తెలిపారు. నేడు అర్హత ఉంటే నేరుగా సంక్షేమ పథకాలను అమలు చేయడం నిజంగా గొప్ప విషయం అన్నారు. మా పిల్లలకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజ్ రీయింబర్స్ మెంట్ వల్ల ఎన్నో కుటుంబాలు ఉన్నత చదువులు చదువుకో గలిగారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఆర్.డి. డి హేండ్ లూమ్స్ & టెక్స్ టైల్స్, బి. ధనుంజయ రావు, ఎ.డి.ఓ, పి.వి. ఎల్. గణేష్, డవలప్ మెంట్ అధికారులు, సి. హెచ్ రవి కుమార్, బి.టి.నాయుడు, జి.కృష్ణ భాస్కర్,
వీవర్ సెల్ ప్రెసిడెంట్ , వై.సూర్యనారాయణ, దేవాంగ కార్పొరే షన్ స్టేట్ డైరెక్టర్ బి.వి.వి.సత్యనారాయణ, డి.వీర భద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *