– బ్రౌన్ మందిరానికి కలెక్టర్ మాధవీలత హామీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లోని వివిధ ప్రభుత్వ శాఖలలో తెలుగు భాష పరిపాలన భాషగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత హామీ ఇచ్చారు.శుక్రవారం ఉదయం సి.పి.బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి జిల్లా కలెక్టర్ ని ఆమె చాంబర్ లో కలిసి తెలుగు భాష అమలును నిర్బంధంగా అమలు చేయాలని అభ్యర్ధించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంలో ఆధ్యాత్మిక పక్ష పత్రిక ‘ శ్రీ సన్నిధానం ‘ వార్షిక సంచికను కలెక్టర్ మాధవీలత ఆవిష్కరించారు.ఆదిత్య కళాశాల అధ్యాపకుడు, ఎన్.ఎస్.ఎస్. అధికారి డా.జి.వి.నాగేశ్వర రావుకు సంబంధించిన ‘ ఆదిత్య సేవాస్త్రం’ అభినందన సంచికను కూడా కలెక్టర్ ఆవిష్కరించారు.సి.పి.బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి కలెక్టర్ మాధవీలత ను బ్రౌన్ మందిరం తరపున సన్మానించి, జ్ఞాపిక అంద జేశారు. డా. నాగేశ్వర రావు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News