Breaking News

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శుక్రవారం నగర కమిషనర్ టేలికాన్ఫరెన్స్ ద్వారా ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులకు వర్షాల వలన ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపధ్యంలో అధికారులు, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు సంబందిత సచివాలయం కార్యదర్శులతో తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించాలన్నారు. ప్రదానంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా బెయిల్ అవుట్ చేయాలని ఆదేశించారు. గాలుల వలన విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడినా త్రాగునీటి సరఫరాకి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా పంపింగ్ కేంద్రాల్లో జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని, సంబందిత ఏ.ఈ., డి.ఈ.ఈ.లు నేరుగా పర్యవేక్షణ చేయాలన్నారు. రోడ్ల మీద ఎక్కడైనా చెట్లు పడితే వాటిని వెంటనే తొలగించడానికి పార్క్ సిబ్బందిని సిద్దంగా ఉంచాలని ఏడిహెచ్ని ఆదేశించారు. శిధిలావస్థ భవనాలలో నివాసం ఉండే వారికి వర్షాల వలన భవనాలు కూలి ప్రమాదాలు జరుగుతాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేయాలని సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. నగర ప్రజలు కూడా స్థానికంగా ఎక్కడైనా సమస్యలు ఎదురైతే నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0863-2345103 నంబర్ కి కాల్ చేయవచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *