Breaking News

క్షేత్ర స్థాయిలో పారిశుధ్య నిర్వహణ తీరు పరిశీలన

-విధులలో అలసత్వం వహించకుండా భాద్యతగా నిర్వర్తించాలి
-కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ కమీషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఈ రోజు పారిశుద్య పనుల పర్యవేక్షణలో భాగంగా నగరంలోని సర్కిల్-3 పరిధిలో గల 5 వ డివిజన్ క్రిస్తురాజుపురం అమ్మ కళ్యాణ మండపం దగ్గర పర్యటించారు.ఈ సందర్భంగా కొన్నిచోట్ల చెత్త తొలగింపులో సిబ్బంది అలసత్వాన్ని గుర్తించి , మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం తీసుకోవలసిన చర్యల గురించి వివరిచడం జరిగినది.బిన్ ఫ్రీ సిటీలో భాగముగా నగరములో గల అన్ని డంపర్ బిన్నులను తొలగించడం జరిగినందున ప్రజలందరు తప్పనిసరిగా తమ ఇంటినందే చెత్తను తడి మరియు పొడి చెత్త గా వేరుచేసి ప్రతిరోజు మీ ఇంటివద్దకు వచ్చు పారిశుధ్య సిబ్బంది కి అందించ వలసినదిగా తెలియచేసినారు.అదేవిధముగా సచివాలయ పరిధిలో జరుగుతున్న శానిటేషన్ పనుల గురించి మరియు చెత్త సేకరణకు శానిటేషన్ సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చుచున్నది లేనిదీ అక్కడి ప్రజలను అడిగి తెలుసుకొన్నారు .వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర వ్యాప్తంగా ఉన్న అన్ని డ్రైను కాలువల్లో పూడికతీత పనులను క్రమంతప్పకుండా నిర్వహిస్తూ, సిల్టు వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేలా పర్యవేక్షించాలని అధికారులు, సచివాలయాల శానిటేషన్ కార్యదర్శులను కమిషనర్ గారు ఆదేశించారు.ఈ పర్యటనలో శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *