Breaking News

జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం

 

-4,56,053 ధృవీకరణ పత్రాలు ఉచితంగా పంపిణీ చేశాం: జిల్లా కలెక్టర్

తిరుపతి, , నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండి తెలిసో, తెలియకో ప్రభుత్వ పథకాలు లబ్ది పొందని వారిని గుర్తించి ఆ కుటుంబాలకు అవసరమైన ద్రువపత్రాలు అందిచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా జిల్లాలో గత మాసం జూలై లో నెలపాటు నిర్వహించి స్వయంగా ప్రతి ఇంటివద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో 481 గ్రామ, 210 వార్డు సచివాలయాల (691) పరిధిలో వాలంటీర్లు , అధికారులు , సిబ్బంది కలసి 6,43,863 గృహాలను (90.42% ) సందర్శించి జగనన్న సురక్షలో సూచించిన 11 రకాల సేవలకు ఎలాంటి సర్వీస్ చార్జీలు లేకుండా ఉచితంగా 4,56,053 అవసరమైన సర్టిఫికెట్లు సచివాలయ పరిధిలో క్యాంపులు నిర్వహించి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అందజేశారని తెలిపారు. అర్హతలేని కారణంగా 4,325 దరఖాస్తులు తిరస్కరిస్తూ, తిరస్కరించిన వాటి వివరాలు దరఖాస్తుదారులు సంతృప్తి చెందేలా వివరించారని తెలిపారు. మరో 8,961 అభ్యర్థనలు పరిశీలన దశలో వున్నాయని తెలిపారు. ఆదాయ దృవపత్రాలు 2,19,923, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్స్ 2,04,275, ఆధార్ కు మొబైల్ అనుసందానం 12,391, ఫ్యామిలి మెంబర్స్ సర్టిఫికెట్లు 478, జనన,మరణ ద్రువపత్రాలు 20, కొత్త రేషన్ కార్డులు 385, స్ప్లిట్ రేషన్ కార్డులు 410, రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చడం 1529, సి.సి.ఆర్.సి. కార్డులు 92, ఒన్ బి 9994, అడంగల్ లు 5188, మ్యుటేషన్లు 04, కుటుంబ సభ్యుల స్ప్లిట్ 160 ఇలా అవసరమైన ధ్రువ పత్రాలు టాక్స్ ఫోర్స్ , స్పెషల్ ఆఫీసర్లు, పర్యవేక్షణ అధికారుల నియామకంతో ప్రజాప్రతినిధుల సహకారంతో కనీస సౌకర్యాల ఏర్పాటుతో క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించగలిగామని వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *