-రాష్ట్రంలో తిరుపతిలో జిందాల్, కడప లో JSW ప్రధాన ఉక్కు కర్మాగారాల ఏర్పాటు జరుగుతున్నాయి: స్పెషల్ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్
తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త:
తిరుపతి ఉక్కు మన జీవితంలో, సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నదని, కాలుష్య నియంత్రణలో భాగంగా పర్యావరణ హిత స్టీల్ ఉత్పత్తి లక్ష్యం కావాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఉదయం స్థానిక తాజ్ హోటల్ లో కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ (cii), ఆంధ్రప్రదేశ్ వారు దేశంలోని పలు రాష్ట్రాల స్టీల్ ఉత్పత్తి దారులు, ట్రేడర్స్, సప్లైర్స్ తో “ఉక్కు భవిష్యత్ రూపొందించడం” అనే అశంపై కాన్ఫెరెన్స్ నిర్వహించగా నీరబ్ కుమార్ ప్రసాద్ అతిధిగా పాల్గొని ప్రసంగించారు.నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ స్టీల్ మరియు అల్లాయ్ వాటి యొక్క సుస్థిరత, భవిష్యత్తుపై ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా వుందని స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలో ఇండియా 2 వ స్థానంలో ఉందని అన్నారు. ప్రపంచంలో 8 శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు స్టీల్ ఉత్పత్తి నుండి వస్తున్నాయని తద్వారా పర్యావరణ, వాతావరణ మార్పులకు దోహదం చేస్తున్నాయని, అలా కాకుండా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించే దిశలో పర్యావరణ హిత స్టీల్ ఉత్పత్తి ఉండేలా సమర్థ, వినూత్న విధానాల్ని, సరికొత్త టెక్నాలజీని అమలు చేయడం ద్వారా ఇది సాధ్యం అని అన్నారు.జాతీయ ఉక్కు పాలసీ – 2017 సూచించిన మేరకు స్వల్పకాలిక ప్రణాళిక ప్రకారం 2030 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి మరియు తలసరి వినియోగాన్ని మూడు రెట్లు పెంచడం, ఇనుము మరియు ఉక్కు రంగం యొక్క ప్రత్యక్ష CO2 తీవ్రత తగ్గింపు , మధ్యస్థ కాలం (2030-2047), గ్రీన్ హైడ్రోజన్ మరియు కార్బన్ క్యాప్చర్, నిల్వ మరియు వినియోగం (CCUS), దీర్ఘకాలిక (2047-2070), నికర-సున్నాకి పరివర్తనను సాధించడంలో సహాయపడే విఘాతం కలిగించే ప్రత్యామ్నాయ సాంకేతిక ఆవిష్కరణలతో గ్రీన్ స్టీల్ కోసం రోడ్‌మ్యాప్‌ను నిర్వచించడానికి 13 టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసిందని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే, ఇది 9.4 MTA ఉక్కు ఉత్పత్తితో భారతదేశంలో ఉక్కు ఉత్పత్తిలో 7% వాటాను కలిగి ఉందని, నెలకు 1.20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దాదాపు 35 పరిశ్రమల ఉనికితో ఫెర్రో మిశ్రమాల ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రగామిగా వుందని తెలిపారు. రాష్ట్రంలో మరో రెండు ప్రధాన ఉక్కు కర్మాగారాలు తిరుపతిలో జిందాల్ స్టీల్ (2.25MT) , కడపలో జే ఎస్ డబ్ల్యు (3.00 MT) సామర్థ్యంతో ఏర్పాటు జరుగుతున్నదని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ఎ.పి. అన్ని విధాల అనుకూలమని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ వరుసగా 2వ సారి ర్యాంకింగ్ లో కూడా అగ్రస్థానంలో ఉందని అన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ, హైడ్రో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎన్టీపీసీ వారితో ఒప్పందంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మేరకు రాష్ట్రం ముందుకు అడుగులు వేస్తోందని తెలిపారు. సుస్థిరమైన సమర్ధవంతమైన మరియు వినూత్నమైన భవిష్యత్తు కోసం భారతీయ ఉక్కు పరిశ్రమ దిశా నిర్దేశం కావాలని అన్నారు.ఐ ఐ టి డైరెక్టర్ కె.ఎన్. సత్య నారాయణ మాట్లాడుతూ పరిశ్రమలకు కావాల్సిన వివిధ స్థాయిల్లో కావాల్సిన నైపుణ్యం గల ఇంజినీర్లను వివిధ యూనివర్సిటీలు తయారు చేస్తున్నాయని తెలిపారు.కార్యక్రమ ప్రారంభానికిముందు తిరుపతి సి ఐ ఐ చైర్ పర్సన్ ప్రియమంజరి ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వివరించారు.ఈ కాన్ఫెరెన్స్ లో ఐ ఐ టి డైరెక్టర్ కె.ఎన్. సత్య నారాయణ , ప్రొఫెసర్ డి సి కిరణ్ , సి ఐ ఐ ప్రతినిధులు మాజీ చైర్మన్ విజయ్ నాయుడు గల్లా , తిరుపతి చైర్మన్ ప్రియమంజరి , వైస్ చైర్మన్ పుస్ పిట్ గార్గ్ , ఎలక్ట్రో స్టీల్ -రాజీవ్ ప్రకాష్ , టాటా స్టీల్ –హరిబాబు ఉపాద్యాయ , గాడ్రెజ్ గ్రీన్ ముతు సేజియన్ , జిసి అడ్వైజరీ -ప్రియాంక , అర్జాస్ స్టీల్ -శ్రీధర కృష్ణ మూర్తి, డేనియల్ ఇండియా -గజేంద్ర పన్వార్ , వీల్స్ ఇండియా- భారతి, వోల్వో -గిరీష్ , నిప్పాన్ స్టీల్ రాఘవన్ , దేశంలోని పలు రాష్ట్రాల పారిశ్రామిక వేత్తలు, ట్రేడర్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News