Breaking News

ఆదివాసీ దినోత్సవ వేడుకలు ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఒక చక్కటి వేదిక…

-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ స్పందన హాలులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మాధవీలత, జెసి తేజ్ భరత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఆగస్టు 9 న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నా మన్నారు. మన దేశ, జాతి మూలాలు కు ప్రతీకలు ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు అన్నారు. V గిరిజన సంక్షేమ పాఠశాల, వసతి గృహాల బాలికలు ప్రదర్శించిన దింశా నృత్యం ఎంతో ఆకట్టుకుందని, వారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, షెడ్యూల్ తెగల జాతుల, ప్రజల హక్కులు కాపాడేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకుని రావడం జరిగిందన్నారు. భద్రత, సామాజిక ఆర్థిక చేకూర్పు వంటి అంశాల ద్వారా వారికి రక్షణ కల్పించడం జరుగుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం డా బి ఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, బిర్శ ముండా, కొమరం భీం చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి గిరిజన సంక్షేమ వసతి గృహాల పాఠశాలల విద్యార్థినిలు గిరిజన నృత్య ప్రదేశాలు చేశారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భారత్, ప్రధానోపాధ్యాయురాలు ఏం. ఇందిరాగాంధీ ప్రియదర్శిని, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి కె. ఎస్. జ్యోతి, స్థానిక జిల్లా నాయకులు తాళ్లూరి బాబు రాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, సమతం గన్నయ్య, బండి విజయ భాస్కర్, విద్యార్థినులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *