-మూడు విడతల్లో 1307 జంటలకు రూ.9.79 కోట్లు జమ
-ఎస్టీ లు 8 , ఎస్సీ లు 529 , బిసి లు 712 , మైనార్టీలు 28 , దివ్యాంగులు 22 , భవన నిర్మాణ కార్మికులు 8 మంది
– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు అర్హత సాధించాలంటే వధూవరులిద్దరికీ 10 వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరని నియమ నిబంధనల మేరకు తల్లిదండ్రులు తమ పిల్లలను ఖచ్చితంగా పదో తరగతి చదివించేలా ఈ పథకాలు దోహదం చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.బుధవారం ఉదయం కలెక్టరేట్ లో వైయస్ఆర్ కళ్యాణమస్తూ, వైయస్ఆర్ షాది తోఫా 3 వ విడత నగదు విడుదల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేయగా, జిల్లా స్థాయి కార్యక్రమం కలెక్టరేట్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పెళ్లి నాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు. అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన వల్ల బాల్య వివాహాల నివారణతో పాటు వారు ఇంటర్ వరకు చదివేందుకు జగనన్న విద్యా దేవెన, వసతి దీవెన సాయం ఉండడం, ఆ పై చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, భోజన, వసతి ఖర్చులకు సైతం కలిపించడం విద్య ను ప్రోత్సహించేందుకు సహాయకారిగా నిలుస్తోందని అన్నారు. ప్రతి మండలం లో ఒక బాలికల కోసం ఒక ఇంటర్మీడియేట్ కళాశాల, ఒక బాలికల, బాలుర కళాశాల ఆలోచన ద్వారా బాలికా విద్య ను ప్రోత్సహించడం జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆమేరకు చర్యలు తీసుకుంటామని సిఎం ప్రకటించడం జరిగిందని మాధవీలత తెలిపారు.వైయస్ఆర్ కళ్యాణమస్తూ, వైయస్ఆర్ షాది తోఫా తో కలిపి మూడు విడతల్లోఅందిస్తున్న సాయంతో కలిపి గడిచిన 9 నెలల్లోనే 1307 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.79 కోట్లు ప్రభుత్వం జమ చేసిందన్నారు.2022 అక్టోబర్ డిసెంబర్ కు చెందు, ఫిబ్రవరి 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్పులైన 108 జంటలకు రూ. 91 లక్షలు, రెండవ విడతలో జనవరి నుంచి మార్చి 2023 వరకు మే 2023 లో 522 జంటలకు రూ.3.83 కోట్లు, మూడో విడత లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆగస్ట్ నెలలో 677 జంటలకు రూ.5.05 కోట్ల మేరకు ఆర్థిక సహాయం అండచెయ్యడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.ఆడబిడ్డ చదవాలని, కుటుంబంలో ఒక స్త్రీ చదివితే ఆ కుటుంబం మొత్తం చదువుకుంటుంది అనే ముఖ్యమంత్రి గొప్ప ఆలోచనకు ఇది నిదర్శనం అన్నారు. ఈ దఫా ఆర్థిక సాయాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా దూదేకుల, నూర్ బాషాల విజ్ఞప్తిని మన్నించి వారికి కూడా వైఎస్సార్ షాదీ తోఫా తో సమానంగా లబ్ధి రూ.1,00,000 కు పెంచి ప్రభుత్వం అందిస్తున్నారు. ఈ వర్గాలకు చెందిన అర్హులైన గత లబ్ధిదారులకు కూడా పెరిగిన ఈ పెంపును పథకం ప్రారంభపు తేదీ నుంచే వర్తింపు చేస్తుందని తెలిపారు.ఎస్సీ లకు, ఎస్టీలకు లక్ష చొప్పున, ఎస్సీ ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ. లక్షా ఇరవై వేలు, బిసి లకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు, మైనార్టీలకు రూ. లక్ష, విభిన్న ప్రతిభావంతులైన వారికి రు. లక్షా 50వెలు, భవన నిర్మాణ కార్మికుల కు రూ.40 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లాకు చెందిన అబ్దుల్ అజీజ్, షకుం మారువా మాట్లాడుతూ షాది తోఫా ద్వారా వచ్చిన నగదు పరిషోతకం తమ కుటుంబానికి ఎంతో అండగా నిలిచిందని, పెళ్లి కోసం తీసుకున్న అప్పులు తీర్చడం కు సహాయకారిగా ఉందని జగనన్న కు కృతజ్ఞతలు తెలిపారు.సత్యనారాయణ సాయి లీల దంపతులు మాట్లాడుతూ, పేద కుటుంబలకు చెందిన తమ వంటి వారిపై వివాహ ఖర్చుల భారం లేకుండా , జగనన్న భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని మాలాంటి వాళ్ళం కోరుకుంటున్నట్లు తెలిపారు. మా కుటుంబం సిఎం కు కృతజ్ఞత కలిగి ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిఆర్డిఎ పిడి ఎస్. సుభాషిణి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, యువ జంటలు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News