Breaking News

ఆమ్ ఆద్మీ పార్టీ గురించితప్పుగా మాట్లాడితే సహించేది లేదు… : జి. ఎస్. ఫణి రాజ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగస్తుల బదిలీలు, నిర్వహణ వగైరా ఢిల్లీ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండాలని దానిలో కేంద్రం జోక్యం ఉండకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, కానీ బిజెపి ప్రభుత్వం కుట్ర పూర్వకంగా ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనంచెలాయించటం కోసం ఢిల్లీ ప్రభుత్వాన్ని అణగదొక్కడం కోసం ఢిల్లీ సర్వీసెస్ బిల్లు పేరట ఒక చట్టం తీసుకువచ్చి ఆమోదం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తోటి రాష్ట్రం గురించి ఆలోచించకుండా సిగ్గు, ఎగ్గు లేకుండా ఆ బిల్లుకు మద్దతు వై ఎస్ ఆర్ సి పి . పార్టీ ఇచ్చింది అని ఆమ్ ఆద్మీ పార్టీ గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు జి. ఎస్. ఫణి రాజ్ హెచ్చరించారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీ వై.ఎస్.ఆర్ సి.పి గురించి ఎప్పుడూ మాట్లాడకపోయిన బీజేపీ ప్రాపకం కోసం ఆమ్ ఆద్మీ పార్టీపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఇకనుండి మేము బిజెపి పైనే కాదు వైఎస్ఆర్సిపి పై కూడా విమర్శలు మొదలు పెడతామని ఆయన అన్నారు. వైఎస్ఆర్సిపి చేసే ప్రతి అవినీతి కూడా మేము వెలికి తీసి ప్రజలకు తెలియపరచి మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రాకుండా మా వంతు కృషి చేస్తామని ఈ బిల్లును వ్యతిరేకించడానికి ప్రజలను తప్పుదారి పట్టించడానికి అనే నిర్లజ్జగా మాట్లాడిన విజయసాయిరెడ్డి పబ్లిక్ లోనికి ఒంటరిగా వెళ్లే దమ్ము నీకు గాని ,మీ నాయకుడికి గాని ఉందా ?అని అన్నారు. దొడ్డి దారిన పార్లమెంటులోనికి వెళ్లిన వాడివి నువ్వు పబ్లిక్ గురించి మాట్లాడతావా నిప్పుతో ఆడకూడదు అని అన్నావు అమ్ ఆద్మీ పార్టీ నిప్పులాంటిది ఖచ్చితంగా కాలిపోతారని మాకు చేతకాదని అనుకుంటున్నావా ,36 కేసుల్లో 2 ముద్దాయిగా ఉన్న నీవు అమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని అన్నారు .మీలాగా అవినీతి సొమ్ముతో మేము పార్టీని పెట్టలేదు మాది అరాచక పార్టీ అంటావా ?అరాచకం చేసేది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు లేని అరాచకం చేసేది మీరు కాదా ?మీ అరాచకం గురించి ప్రజలకి తెలియదనుకుంటున్నావా? పార్టీలోకి వచ్చి వెళ్లిపోయేవారు స్వార్థంతో వస్తారు వాళ్ళు అనుకున్నది జరగకపోతే పార్టీ మీద నాయకులు మీద బురద జల్లి వెళ్లిపోతారు ,మా పార్టీలోనూ అంతే నీవు ఉదాహరించిన కుమార్ విశ్వాస్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ,అశుతోష్ వీళ్ళు ఎవరో కూడా తర్వాత మా పార్టీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు కానీ మీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నీ ముఖ్యమంత్రిని ,నిన్ను పార్టీలో ఉండి కూడా ఎలా తిడుతున్నాడో అందరికీ తెలిసిన విషయమే ,అతని మీద పార్టీ పరంగా చర్యలు తీసుకునే దమ్ము లేని మీకు మా పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఎప్పుడైనా పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టారా? పోలవరం గురించిమాట్లాడారా? విభజన హామీలు గురించి మాట్లాడారా? కేంద్రం మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తాను అన్న మీ ముఖ్యమంత్రి మోడీ కాళ్లు ఎందుకు పట్టుకున్నారు? ప్రశ్నించారు. కేసు నుండి బయటపడడానికా ,ముందు ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి పార్లమెంట్లో ప్రస్తావించడం నేర్చుకోండి .ఇక్కడ ప్రజలను దారుణంగా ఇబ్బంది పెడుతున్న మీరు పక్క రాష్ట్రాల హక్కులు హరించే బిల్లులకు మద్దతిస్తూ కేసులు నుండి తప్పించుకుందామని దురాలోచనతో ఉన్నారని పార్టీని దుయ్యబట్టారు.ఆంధ్ర ప్రదేశ్ నుపాలించే హక్కు మీరు కోల్పోయారు. 2024 తర్వాత ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు గుర్తించుకో విజయ సాయి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కందుల పరమేశ్వర్ పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *