విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాక్ విత్ వెలంపల్లి 2K మారథాన్ పోస్టర్ ను, టి షర్ట్స్, కాప్స్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు. ఆగష్టు 15న మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదినం పురస్కరించుకొని ఆగష్టు 13న అనగా ఆదివారం ఉదయం 6 గం.లకు శివాలయం సెంటర్ వద్ద నుంచి 2K మారథాన్ వాక్ విత్ వెలంపల్లి పోస్టర్ ను నేడు గొల్లపూడి లోని మహాత్మా గాంధీ కమర్షియల్ కాంప్లెక్ కార్యాలయం నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మరియు వివిధ చైర్మన్లు డైరెక్టర్ల, వివిధ వ్యాపార సంఘాల అసోసియేషన్ సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా ఆగష్టు 13న ఏర్పాటు చేయనున్న వాక్ విత్ వెలంపల్లి 2k మేరధాన్ కార్యక్రమాన్ని మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News