రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్ ఎస్ ఆర్ లో భాగంగా ఇంటింటి ఓటరు గుర్తింపు ప్రక్రియలో రాజకీయ పార్టీలు సహయకుల నియామకం చేపట్టి బి ఎల్ వో తో అనుసంధానం చేయడం ద్వారా హేతుబద్ధత కలిగిన జాబితా చెయ్య గలమని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత స్పష్టం చేశారు.స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం మధ్యాహ్నం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ఓటరు జాబితా స్వచ్చలికరణ నేపథ్యంలో బూత్ లెవల్ అధికారులు వారి పరిధిలోని ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి, ఓటరులను గుర్తించడం జరుగుతోందని అన్నారు. ఆ క్రమంలో జూలై 21 నుంచి డోర్ టూ డోర్ సర్వే ఓటరు జాబితా ను అనుసరించి తనిఖీ చేయడం జరుగుతోందని అన్నారు. ఈ ప్రక్రియలో ఫామ్ లను భౌతికంగా తీసుకోవడం, ఆన్లైన్ ద్వారా నమోదు చెయ్యడం జరుగుతున్నట్లు మాధవీలత తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా పై ఫిర్యాదు చేయడం కంటే ముందస్తుగానే రాజకీయ పార్టీలు చైతన్యం కలిగి, సమస్యల ను తెలియచేస్తే ఎటువంటి తప్పులు లేని ఓటరు జాబితా తయారు చెయ్యడానికి నియోజక వర్గ ఓటరు నమోదు అధికారికి సహాయ కారిగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఫారమ్ 6 లు ఎనిమిది వేలు, ఫారమ్ 7 లు 7501, ఫారం – 49221 స్వీకరించడం జరిగిందని అన్నారు. మొత్తం 91596 ఫారమ్స్ లకు గాను 49974 సరిచేసి, 2474 తిరస్కరించడం జరిగిందన్నారు. ఇంకా 39,148 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. డోర్ టూ డోర్ ఓటరు గుర్తింపు లో భాగంగా 211 మంది మరణించిన వారిని, 10 మంది ఇల్లు మారిన వారిని, 150 మంది డబ్బుల్ ఎంట్రీ ఉన్న వాటిని గుర్తించి తొలగించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనైజేషన్ ప్రక్రియ లో భాగంగా 1500 పైబడి ఓటరులు ఉన్న కేంద్రాలను, నివాస ప్రాంతం కు 2 కిమి పై బడి దూరంలో ఉన్న ఓటర్ల కోసం తగిన ప్రతిపాదనలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నియోజక వర్గ స్థాయి లో ప్రతి మంగళవారం, జిల్లా స్థాయి లో ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని , వీటికి ఆయా రాజకీయ పార్టీలు ఒక వ్యక్తిని శాశ్వత ప్రతినిధిగా నియమించాలని అన్నారు.ఆమేరకు పూర్తి స్థాయి లో సహకారం అందించి ఓటరు నమోదు కార్యక్రమం ఎస్ ఎస్ ఆర్ 2024 ను విజయవంతం చేయాలని కోరారు. రాజాకీయ పార్టీల వారు నియమించుకున్న బూత్ స్థాయి సహాయకులను, ఒక బి ఎల్ ఓ లతో పాటు ప్రతి ఇంటికి ఒకరిని మాత్రమే పంపవలెనని వారిని నిర్ధారణ చేసి ఆ సమాచారం బి ఎల్ వో కి తెలుపుతామని కలెక్టర్ తెలిపారు.రాజకీయ పార్టిలు వారు పాటించవలిసిన మార్గదర్శకాలు, బీఏల్ఓ వారిగా ఓటరు జాబితా, గత వారం నిర్వహించిన సర్వే వివరాలు ఆయా రాజకీయ పార్టీలకు నియోజక వర్గ స్థాయి అందచెయ్యడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయి లో సమగ్ర పట్టిక రూపంలో అందజేస్తామని పేర్కొన్నారు. ఒక్కరే ప్రతి సమావేశంలో పాల్గొనడం ద్వారా పురోగతి విషయంలో స్పష్టమైన వైఖరి సాధ్యం అవుతుందని తెలియ చేశారు. గతంలో ఇళ్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మార్పు అయినా ఓటర్ల పేర్ల ను ఆయా ఇంటి యజమాని నుంచి ఫారమ్ 7 తీసుకుని తొలగించే వారమని, ఎన్నికల కమిషన్ నూతన మార్గదర్శకాలు మేరకు బి ఎల్ వో లు స్వీయ ప్రకటన ద్వారా తొలగించడం జరుగుతుందని అన్నారు. ఇళ్లు మారిన, మరణించిన వారి వివరాలు అందచేసే ఓటరు జాబితా సమగ్రంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకారం ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, వైయస్ఆర్ సీపీ యూ పి వర్మ, , టిడిపి కె . విశ్వనాథ రాజు, సిపిఐ (ఎం) ఎస్ సత్యనారాయణ మూర్తి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News