Breaking News

చిరంజీవి పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు వ్యతిరేకం గా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిరసన సెగ 


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పై వైసీపీ మంత్రులు, శాసన సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలకు వ్యతిరేకం గా నగర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం లెనిన్ సెంటర్లో  జరిగిన నగర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి  పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు దారుణమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదన్నారు. తెలుగు భాష రాని వ్యక్తి మాజీ మంత్రి కొడాలి నాని అని అన్నారు. పకోడీ అంటూ నీచమైన బాష మాట్లాడుతున్నారన్నారు. కోవిడ్ సమయం లో ఎంతో మందికి సహాయం చేశారన్నారు. బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ లు ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ ను మాట్లాడినట్లు చిరంజీవి నీ మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కృష్ణా జిల్లా నుండి నువ్వు మంత్రి గా చేసినందుకు మేము సిగ్గు పడుతున్నామన్నారు. వైసీపీ మంత్రులు, శాసన సభ్యులు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ నేతలకు దైర్యం ఉంటే కేంద్ర బీజేపీ పెద్దలను ప్రశ్నించాలనున్నారు. దీని పై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. అనంతరం కాంగ్రెస్ నేతలు చిరంజీవి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొలనుకొండ శివాజి, వి.గురునాధం, ఎండి హెచ్ ఎస్ బేగ్, ఖుర్షీదా, ఖాజా మొహిద్దిన్, అల్లం రాజేశ్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *