Breaking News

అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలు అమల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదర్శనం.

-స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తిని ప్రతి ఒక్కరం కొనసాగిద్దాం..
-రాష్ట్ర అభివృద్ది కోసం ప్రతి ఒక్కరం పునరంకితమవుదాం..
-జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న సురక్ష ద్వారా 99.99 శాతం మంది అర్హులకు ప్రభుత్వం పథకాలను అందించామని, జిల్లా సత్వర అభివృద్దికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత, ఇన్చార్జి ఎస్పీహోదాలో యం. రజనీ, జాయింట్ క లెక్టరు ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషన్ కె. దినేష్ కుమార్, సహాయ కలెక్టరు సి. యశ్వంత కుమార్, యంపీ. మార్గాని భరత్ రామ్, రూడా చైర్మన్ మేడపాటి షర్మిళా రెడ్డి, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, స్వాతంత్ర్య సమరయోదుల కుటుంబ సభ్యలు, పలువులు న్యాయమూర్తులు, జిల్లా అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధలు, నగరపౌరులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.వేడుకల్లో భాగంగా సభావేదికకు చేరుకున్న ఇన్చార్జి మంత్రికి జిల్లాకలెక్టరు, జిల్లా ఎస్పీ హోదాలో యం. రజని గౌవర ఆహ్వానం పలికారు. అనంతరం సభా వేధికకు చేరుకున్న కలెక్టరుకు ఆహ్వానం పలికారు. తదుపరి సభాప్రాంగణానికి చేరుకున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కు జిల్లా కలెక్టరు, ఇతర జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. సభా వేధికకు చేరుకున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించి పేరేడ్ ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి 77వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు పురష్కరించుకొని విచ్చేసిన న్యాయమూర్తులకు, ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ , యువతకు, మహిళాలోకానికి, విద్యార్థినీ విద్యార్థలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఏదేశమేగినా ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి రాయప్రోలుకు సలాం చేస్తూ, భరతమాతకు నమః సుమాంజిలి ఘటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోనే అత్యధిక‌ మహిళా సమరయోధులను అందించి చరిత్రలో నిలిచిన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఊహకు అందని ఆనందం పొందుతున్నాని పేర్కొన్నారు. కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాని పిలుపునిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సుపరిపాలన అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.స్పందనకు మరింత మెరుగ్గా “జగనన్న సురక్ష” కార్యక్రమం, “జగనన్నకు చెబుదాం..1902” సేవలు, “గడప గడపకు మన ప్రభుత్వం” వంటి బృహత్తర కార్యక్రమాలను తీసుకువచ్చామన్నారు. వైఎస్సార్ జగన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం ద్వారా ప్రజల ఆస్తులకు భరోసా కల్పిస్తూ భారత దేశ చరిత్రలో సమగ్ర భూసర్వే చేపడుతున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఈ ఏడాది దేశ ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున “నా భూమి – నాదేశం” కార్యక్రమాన్ని చేపట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామని మంత్రి వేణుగోపాల్ అన్నారు. “చెట్లేక్కే పాదాలు అంతరిక్షంలో సంచరించేలా భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా” ప్రతిభ కలిగిన నిరుపేద కుటుంబానికి చెందిన జాహ్నవికి “నేనున్నాననే” ఆర్థిక భరోసాను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరం లోనే ప్రకటించడం మనందరికీ గర్వకారణం అన్నారు. జిల్లాలో గత ఏడాదిగా జరుగుతున్న సంక్షేమం పై వివరిస్తూ 99 శాతం మంది అర్హులైన లబ్దిదారులకు పథకాలను అందించామని, మిగిలిన ఒక్క శాతంలో అర్హులను గుర్తించి క్రమంలో “జగనన్న సురక్ష” కార్యక్రమం ద్వారా ప్రతి గడప తలుపు తట్టి అర్హులకు పథకాల ప్రయోజనాలను అందించామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం క్రింద ప్రతి సచివాలయ పరిధిలో 20 లక్షల వరకు అభివృద్ధి పనులు మంజూరు చేసి. ఇప్పటి వరకు 48 కోట్ల వ్యయంతో 1332 పనులు ప్రతిపాదించి1234 పనులు ప్రారంభించామన్నారు.రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతులకు భరోసాను కల్పిస్తూ వై.ఎస్.ఆర్. రైతు భరోసా – పీయం కిసాన్ కార్యక్రమం క్రింద జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకూ ఒక లక్షా 35 వేల మంది రైతు కుటుంబాలకు 102 కోట్ల రూపాయల సహాయాన్ని వారి ఖాతాలకు నేరుగా జమ చేసామన్నారు. పంట రుణాలు క్రింద రైతులకు రూ. 1976 కోట్లు రూపాయలు, వైఎస్ఆర్ సున్నావడ్డీ గా27 వేల మంది రైతులకు 5 కోట్ల రూపాయల వడ్డీరాయితీ, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా 286 రైతు గ్రూపులకు రూ.8 కోట్ల 83 లక్షల రూపాయల రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందచేసామన్నారు. చిరుధాన్య పంటలకు క్వింటాల్ కు రూ.2 వేల 500 రూపాయలను మద్దతు ధరగా ప్రకటించామన్నారు. జిల్లాలో 66 వేల 500 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన ప్రధాన పంటలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. రైతులుకు 2,843 మంది రైతులకు డ్రిప్, స్ప్రింకర్లును 17 కోట్ల రూపాయలతో అందించామన్నారు. కడియంలోని జిల్లా మత్స్య విత్తన క్షేత్ర కేంద్రం ద్వారా ఈ ఏడాది 6.5 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 3.6 కోట్ల మేర ఉత్పత్తి చేసి లక్ష్య సాధన దిశగా అడుకులు వేస్తున్నామన్నారు. పశుపోషకులకు అండగా ఉండేందుకు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో పశువ్యాధి నిర్థారణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 21 వేల పశువులకు వైద్య సేవలందించామని, డా. వైఎస్సార్ పశు ఆరోగ్య సేవా సంచార వాహనం 1962 టోల్ ప్రీ నెంబరు ద్వారా ఇప్పటి వరకు 14 వేల మంది రైతులకు చెందిన పశువులకు వైద్యసేవలందిండం జరిగిందన్నారు. సంక్షేమం పై ప్రసంగిస్తూ వై.ఎస్.ఆర్.పింఛను కానుక క్రింద 16 కేటగిరిల్లో 2 లక్షల 33 వేల మందికి రూ.64 కోట్ల 13 లక్షల రూపాయలు వాలెంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామన్నారు. వైయస్ఆర్ చేయూత పథకం రూ.379 కోట్ల 33లక్షల రూపాలయలు, వైయస్ఆర్ ఆసరా పథకం క్రింద ఇప్పటి వరకు 4 విడతలుగా 30,513 గ్రూపులకు 820 కోట్ల 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మహిళలకు అందించామన్నారు. చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం క్రింద సున్నా వడ్డీ రుణాలుగా రూ.36 కోట్ల 75 లక్షలు,జగనన్న చేదోడు పధకం లబ్దిదారులకు రూ.13 కోట్ల 50 లక్షల జమచేసామన్నారు. ఈ.బి.సి నేస్తం పథకం క్రింద 16,218 మంది మహిళా లబ్దిదారులకు రూ.24.32 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం పథకం 3 వ విడతగా 29 వేల 824 మంది మహిళలకు రూ. 44.73కోట్లు,నేతన్న నేస్తం పథకం క్రింద ఈ ఏడాది రూ.2.20 కోట్లతో ఆర్థిక సహాయాన్నిఅందించండతో పాటు జిల్లాలో పులగుర్త, మురమండలలో రెండు చేనేత క్లస్టర్లను రూ.3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసామన్నారు. వైయస్ఆర్ సున్నావడ్డీ పథకం 36 వేల 816 స్వయంసహాయక సంఘాలకు రూ. 53.81 కోట్ల వడ్డీ రాయితీని అందించామన్నారు. మైనార్టీ సంక్షేమం క్రింద జిల్లాలో 947 మంది మైనార్టీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం క్రింద 1.88 కోట్లు, జగనన్న వసతి దీవెన క్రింద 953 మంది మైనార్టీ విద్యార్థులకు 1.48కోట్లు, ఇమామ్ లకు మౌజం లకుస చర్చి పాస్టర్లకు, దేవాలయల అర్చకులకు గౌరవ వేతనంఅందిస్తున్నామన్నారు.బ్యాంకు లింకేజ్ గా 36 వేల డ్వాక్రా గ్రూపులకు రుణాలుగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1900 సంఘాలకు రూ. 15 వేల 656 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు అందించామన్నారు. వైఎస్సార్ కళ్యాణ మస్తు, వైఎస్సా షాదీ తోఫా గా ఇప్పటి వరకు గత మూడు విడతులుగా 1313 మందికి 9 కోట్ల 88 లక్షలు రూపాయలను అందించామన్నారు. విభిన్న ప్రతిభావంతులయిన 250 మందికి రూ.75 లక్షలు విలువ గల ఉపకరణాలు అందించామన్నారు. జిల్లాలో అమ్మఒడి పథకం ద్వారా రూ. 234 కోట్లు, మన బడి-నాడు నేడు తొలి దశలో 414 పాఠశాలలు అభివృద్ది చేయగా, రెండవ దశలో 655 పాఠశాలల్లో రూ.268 కోట్ల రూపాయల అంచనాలతో పనులు జరుగుతున్నాయన్నారు. జగనన్న విద్యా కానుకగా ఒక లక్షా 22 వేల మంది విద్యార్థులకు 28 కోట్ల 80 లక్షల విలువైన కిట్లుఅందించామన్నారు. గోరుముద్ద ద్వారా పౌష్టకాహారం అందిస్తూ, డిజిటలైజేనేషన్ బోధన విదానంలో భాగంగా రూ. 18 కోట్ల రూపాయలు ఖర్చుచేసామన్నారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవేన, విదేశీ విద్యను ప్రోత్సహిస్తూ విద్యాభివృద్ది అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా జిల్లాలో 18,254 మంది గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారం అందించామన్నారు. జిల్లా కలెక్టరు నేతృత్వంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, కు అదనంగా “బంగారుకొండ” కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టి అధిక రక్తహీనత, వయస్సుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని 1283 మంది పిల్లలను గుర్తించి అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు స్వచ్చందంగా దత్తత తీసుకొని చక్కని కార్యక్రమానికి నాంది పలికి, గత 45 రోజుల్లో 144 మంది పిల్లలనను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దండం అభినందనీయమని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టరు విధానం ద్వారా జిల్లాలో 368 ప్రాంతాల్లో 68 డాక్టర్లతో కూడిన బృందం ఆధ్వర్యంలో 1లక్షా 8వేల మందికి వైద్య సేవలందించడం జరిగిందన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ క్రింద 26 వేల 670 శస్త్ర చికిత్సలు నిమిత్తం 52 కోట్ల 39 లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు.వైద్యరంగంలో పునాది వేయడం ద్వారా భవిష్యత్తు ఫలాలు అందించి ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ప్రభుత్వం బోధనాస్పత్రి రూ. 475 కోట్లతో చేపట్టి ఈ ఏడాది నుంజి 150 ఎంబీబీఎస్ కోర్సు మొదటి ఏడాది తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా జిల్లాలో మొదటి విడతగా 68 వేల 518 గృహాలను రూ. 1233 కోట్ల 34 లక్షల రూపాయలతో గృహ నిర్మాణాలను చేపట్టి 20 వేల గృహాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఒన్ టైమ్ సెటిల్ మెంట్ క్రింద జిల్లాలో 3 లక్షల 37 వేల మంది కి భూమిపై సర్వహక్కులు కల్పించామన్నారు జిల్లా 7 వేల 936 టిడ్కో గృహాలకు గాను పేజ్ -1 క్రింద 3424 ఇళ్ళను పంపిణీ చేయగా, పేజ్-2 క్రింద మిగిలిన 4 వేల 512 ప్లాట్లను త్వరలో అందించనున్నామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ, జగనన్న కాలనీల్లోను, ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల త్రాగునీరు సరఫరా కోసం రూ. 14 వేల కోట్ల రూపాయలతో పనులకు ఆమోదం తెలిపామన్నారు. జిల్లాలో 5,64,555 కార్డు దారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆగస్టు నెల నుంచి ఫోర్ట్ పైడ్ బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. అధిక ధరల నేపద్యంలో మార్కెటింగ్ శాఖ ద్వారా 50 క్వింటాళ్ల టమాటాను రైతుబజార్లు ద్వారా కిలో 50 రూపాయలకే అందించండ జరగిందన్నారు.రోడ్లు భవనాల క్రింద ఈ ఏడాది 120 కి.మీ రహదారి మరమ్మత్తు పనులను 60 కోట్ల రూపాయలతో చేపట్టనున్నామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది ఒక లక్షా 88 వేల మందికి 36 లక్షల పనిదినాలు కల్పించి 85 కోట్ల 55 లక్షలు రూపాయలను వేతనాలుగా చెల్లించామన్నారు. గ్రామ స్వరాజ్ పాలన దిశగా 150 కోట్ల రూపాయలతో 390 గ్రామ సచివాలయ భవనాలు, 81 కోట్ల రూపాయలతో 372 రైతు భరోసా కేంద్ర భవనాలు, 58 కోట్ల రూపాయలతో 338 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ చేపట్టగా ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. సమగ్ర రీసర్వే లో భాగంగా జిల్లాలో 272 గ్రామాల పరిధిలో 373 మంది గ్రామసర్వేయర్ల ద్వారా సుమారు 6 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తి చేసి 60 గ్రామాలకు చెందిన 40,968 యజమానులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసామన్నారు. భూమి లేని నిరుపేదలకు వ్యవసాయభూమి అందించే దిశలో 1311 మందికి వ్యవసాయ భూమి పట్టాలను, 22ఎ1 పరిదిలోకి వచ్చే 758 ఎకరాల భూమిని 352 మంది రైతులకు క్రమ బద్దీకరణ చేసామన్నారు. స్వమిత్వ క్రింద జిల్లాలో 300 పంచాయతీలకు గాను 291 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశామన్నారు.విద్యుత్ శాఖ ద్వారా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులుకు ఉచిత విద్యుత్ సరఫరా క్రింద 12 కోట్ల సబ్సిడిని అందించామన్నారు. ఇరిగేషన్, పరిశ్రమలు, క్రీడలు, తదితర శాఖల అభివృద్ది పై మంత్రి వేణుగోపాలకృష్ణ వివరించారు. అక్రమ మద్యాన్ని నివారించే దిశలో ఆదిశగా ఉన్న కుటుంబాలకు ఆర్థిక చేయూత నిస్తూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల సత్వర సమగ్ర పరిష్కారానికి ప్రతి సోమవారం స్పందన నిర్వహిస్తూ అక్కడక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. మహిళల, బాలికల భద్రత, రక్షణ కొరకు వారి సెల్ ఫోన్లలో దిశ యాప్ డౌన్ లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా వారి భద్రతకు భరోసానిస్తున్నామన్నారు. జిల్లాల్లో టెంపుల్ టూరిజం, కడియపు లంక నర్సరీల ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేపట్టామన్నారు. నగరపాలక సంస్థ రూ. 125 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులు చేపట్టామన్నారు. నిడదవోలు మున్సిపాలటీ పరిధిలో 58.09 కోట్లతో, కొవ్వూరు పురపాలక సంఘ పరిధిలో 58.07 కోట్లుతో హెడ్ వాటర్ వర్క్సు పనులు జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. రూడా(RUDA) మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ ఆథారిటీ పరిధిలో తూర్పుగోదావరి డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 41కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులు చేపట్టి ఇప్పటి వరకు 26కోట్ల 84 లక్షల విలువ గల పనులను పూర్తి చేశామన్నారు. క్రీడలను ప్రోత్సహించే దిశలో ఆడుదాం.. ఆంధ్రా క్రీడా పోటీలను ఈ ఏడాది అక్టోబరు 2 గాంధిజయంతి నుండి 29 రోజులు పాటు నిర్వహించుకుంటున్నామని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత, ఇన్చార్జి ఎస్పీహోదాలో యం. రజనీ, జాయింట్ క లెక్టరు ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషన్ కె. దినేష్ కుమార్, సహాయ కలెక్టరు సి. యశ్వంత కుమార్, యంపీ. మార్గాని భరత్ రామ్, రూడా చైర్మన్ మేడపాటి షర్మిళా రెడ్డి, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, స్వాతంత్ర్య సమరయోదుల కుటుంబ సభ్యలు, పలువులు న్యాయమూర్తులు, జిల్లా అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధలు, నగరపౌరులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *